Share News

Nitish Reddy: పెళ్లి ఎప్పుడు బ్రో అంటూ ప్రశ్న.. తెగ సిగ్గుపడిపోయిన నితీశ్ రెడ్డి

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:04 AM

పెళ్లి ఎప్పుడు బ్రో అన్న అభిమాని ప్రశ్నకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెగ సిగ్గుపడిపోయిన వీడియో ప్రస్తుత నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

Nitish Reddy: పెళ్లి ఎప్పుడు బ్రో అంటూ ప్రశ్న.. తెగ సిగ్గుపడిపోయిన నితీశ్ రెడ్డి
Nitish Reddys Viral Fan Moment

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో నిన్న జరిగిన ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచు అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ వాసుల ఎంజాయ్‌మెంట్‌కైతే లెక్కేలేదు. స్టేడియానికి భారీగా తరలి వచ్చిన అభిమానులు కేరింతలు కొడుతూ మ్యాచ్‌ను ఆస్వాదించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు బాదుడు చూసి పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఇదిలా ఉంటే మైదానంలో క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని స్టేడియంలోని అభిమానులు పెళ్లి గురించి ప్రశ్నించడం మరో హైలైట్‌గా మారింది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది (SRH Vs RR Nitish kumar Reddy Viral Fan Moment)

మైదానంలో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డిని పలకరించి అభిమానులు పెళ్లి ఎప్పుడో బ్రో.. అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. బ్రో లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అని కూడా ప్రశ్నించారు. అభిమానుల సరదా ప్రశ్నలకు అదే రేంజ్‌లో నితీశ్ కూడా సమాధానం ఇచ్చాడు. తనది లవ్ మ్యారేజ్ కాదని కూడా అన్నాడు. అతడి రెస్పాన్స్ చూసి అభిమానులు మళ్లీ గోలగోల చేశారు.


Also Read: వావ్.. పరుగుల వరద.. ఈ హైలైట్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేము

ఇక ఈ వీడియోపై నెట్టింట ఓ రేంజ్‌లో కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. పెళ్లి ప్రస్తావన తేగానే నితీశ్ తెగ సిగ్గుపడిపోయాడని కొందరు అన్నారు. బ్రో.. హ్యాండ్సమ్‌గా ఉన్నాడని కొందరు.. ఆరెంజ్ ఆర్మీ కాబట్టి పెళ్లి కూడా ఇక్కడ అమ్మాయితోనే అని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇంతగా మొహమాటపడే నితీశ్ రెడ్డిని చేసుకునే అమ్మాయి నిజంగా లక్కీ అని ఇంకొందరు అన్నారు. పెళ్లి కానోళ్ల పాట్లు పగోడికి కూడా వద్దన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


Also Read: వీల్‌చైర్‌లో ఉన్నా.. వదలరు!

ఇక ఆర్ఆర్‌‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ చెలరేగి ఆడారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ ఆరు వికెట్ల నష్టానికి 286 భారీ స్కోరు చేసింది. ఆ తరువాత చేదనలో చతికిల పడ్డ ఆర్ఆర్ కేవలం 242 పరుగులకే పరిమితం కావడంతో 44 తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. ఇక నితీశ్ రెడ్డి కూడా బ్యాట్ ఝళిపించాడు. 15 బంతుల్లో 30 రన్స్ చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2025 | 12:06 PM