విజయోత్సాహంలో సన్‌రైజర్స్
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:19 AM
తొలి మ్యాచ్‌లో సొంతగడ్డ హైదరాబాద్‌లో ఘన విజయం సాధించి సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో...

ఐపీఎల్‌లో నేడు
వేదిక హైదరాబాద్
హైదరాబాద్ X లఖ్‌నవూ, రా.7.30
పంత్‌పై భారీ అంచనాలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తొలి మ్యాచ్‌లో సొంతగడ్డ హైదరాబాద్‌లో ఘన విజయం సాధించి సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో పోరుకు సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్, హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డితో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ అరవీర భయంకరంగా ఉంది. లఖ్‌నవూ విషయానికొస్తే కొత్త కెప్టెన్ రిషభ్ పంత్ సారథ్యంలో ఆ జట్టు తొలి మ్యాచ్‌లో పరాజయాన్ని చవి చూడడం తెలిసిందే. పంత్ కెప్టెన్సీతో పాటు అతడి బ్యాటింగ్ సామర్థ్యానికి కూడా ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ దళపతి కమిన్స్ నుంచి సవాల్ ఎదురు కానుంది. లఖ్‌నవూ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్, వికెట్ కీపర్ పూరన్, మార్‌క్రమ్, మార్ష్ చెలరేగితే ఉప్పల్‌లో బౌండ్రీలు, సిక్సర్ల మోత తప్పదు. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..