SRH vs MI 2025: రైజర్స్ గెలిస్తేనే?
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:37 AM
ఐదు ఓటములతో 9వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగతా మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. ముంబైతో బుధవారం జరిగే మ్యాచ్ కీలకం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలకడలేమి ఆటతో తడబాటుకు గురవుతోంది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో తమ 8వ మ్యాచ్ ఆడనున్న రైజర్స్‌కు ఇక్కడ నుంచి ప్రతీ పోరులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఒక్కటి ఓడినా ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటుతాయి. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట్లో ఓడి 9వ స్థానంలో ఉన్న రైజర్స్ రాత మారాలంటే టాపార్డర్ బ్యాటర్లు సమష్టిగా రాణించాల్సి ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఊపులో ఉన్న ముంబై తమ సొంతగడ్డ వాంఖడేలో రైజర్స్‌ను ఓడించి అన్ని విభాగాల్లో పైచేయి కనబర్చింది. రోహిత్ ఫామ్‌లోకి రావడం కూడా ఆ జట్టుకు పెద్ద సానుకూలాంశం.