సూర్య ముంబై వెంటే..
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:17 AM
డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును వీడడం లేదని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్పష్టం చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మాదిరి సూర్య కుమార్...

ముంబై: డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును వీడడం లేదని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్పష్టం చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మాదిరి సూర్య కుమార్ కూడా గోవా తరఫున రంజీ మ్యాచ్‌లను ఆడబోతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఈనేపథ్యంలో ఎంసీఏ స్పందిస్తూ.. ‘సూర్య తమ జట్టును వీడనున్నాడనే పుకార్ల గురించి తెలిసింది. అందుకే నిజానిజాల గురించి ఎంసీఏ అధికారులు సూర్యతోనే నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా అతను ముంబైకి ఆడడాన్నే గౌరవంగా భావిస్తున్నట్టు మాతో స్పష్టం చేశాడు’ అని ఎంసీఏ సూచించింది. మరోవైపు తన నేతృత్వంలో ముంబై జట్టు నుంచి మరికొంత మంది ఆటగాళ్లను గోవాకు ఆడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వచ్చిన కథనాలను సూర్యకుమార్ ఖండించాడు. ‘మీరు స్ర్కిప్ట్ రైటర్లా? జర్నలిస్టులా? హాస్యం కోసం ఇక కామెడీ సినిమాలు చూడడం మానేసి ఇలాంటి ఆర్టికల్స్ చదువుతా’ అని ఎక్స్‌లో పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..