రోహిత్, కోహ్లీ ఆ గ్రేడ్‌లో ఉంటారా ?
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:12 AM
2024-25 సీజన్‌కు సంబంధించి పురుషుల సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను బీసీసీఐ త్వరలో వెల్లడించనుంది. ఈనేపథ్యంలో ఆ జాబితాలో ఉండే క్రికెటర్లపై ఉత్కంఠ ఏర్పడింది...

న్యూఢిల్లీ : 2024-25 సీజన్‌కు సంబంధించి పురుషుల సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను బీసీసీఐ త్వరలో వెల్లడించనుంది. ఈనేపథ్యంలో ఆ జాబితాలో ఉండే క్రికెటర్లపై ఉత్కంఠ ఏర్పడింది. గత ఏడాది చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు ఈసారి అవకాశం లభించవచ్చు. అలాగే అభిషేక్ శర్మకు కూడా ఈ ఏడాది స్థానం కల్పిస్తారని తెలిసింది. టీ20ల నుంచి రిటైరైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజాలకు ఈసారి గ్రేడ్-ఎ+లో చోటు కల్పిస్తారా..అనేది ఆసక్తికరం. బీసీసీఐ నిబంధనల ప్రకారం గ్రేడ్-ఎ+లో ఉండాలంటే టెస్ట్‌లు, వన్డేలు, టీ20లలో ఆడుతుండాలి. నిరుడు గ్రేడ్-ఎలో ఆరుగురు క్రికెటర్లు, గ్రేడ్-బిలో ఐదుగురు, గ్రేడ్-సిలో 15 మంది ఆటగాళ్లకు బీసీసీఐ చోటు కల్పించింది.
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..