Share News

ముంబైకి బై.. గోవాకి జై!

ABN , Publish Date - Apr 03 , 2025 | 02:39 AM

యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌కు పునాదులు వేసిన ముంబై జట్టును వీడనున్నాడు...

ముంబైకి బై.. గోవాకి జై!

యశస్వీ జైస్వాల్‌ అనూహ్య నిర్ణయం

ముంబై: యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌కు పునాదులు వేసిన ముంబై జట్టును వీడనున్నాడు.. 2025-26 సీజన్‌ నుంచి దేశవాళీల్లో గోవాకి ఆడనున్నాడు. జాతీయ జట్టు మ్యాచ్‌లు లేకుంటే...23 ఏళ్ల జైస్వాల్‌ దేశవాళీల్లో గోవా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముంది.. వ్యక్తిగత కారణాలతోనే ముంబైని వీడాలని యశస్వీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈమేరకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరుతూ ముంబై క్రికెట్‌ సంఘా(ఎంసీఏ)నికి అతడు లేఖ రాశాడు. దానిని ఆమోదిస్తూ ఎంసీఏ బుధవారం నిర్ణయం తీసుకుంది. జైస్వాల్‌ జమ్మూ కశీర్‌తో గత జనవరిలో జరిగిన గ్రూప్‌-ఎ రంజీ లీగ్‌ మ్యాచ్‌లో ముంబైకి చివరిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో అతడు 4, 26 పరుగులు చేశాడు. కాగా..ఆ మ్యాచ్‌లో ముంబై ఓడింది. ‘జైస్వాల్‌ మా జట్టుకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతడికి స్వాగతం’ అని గోవా క్రికెట్‌ సంఘం కార్యదర్శి షంబా దేశాయ్‌ అన్నాడు. ఇటీవలి కాలంలో అర్జున్‌ టెండూల్కర్‌, సిద్దేశ్‌ లాడ్‌ కూడా ముంబైని వీడి గోవా జట్టుకు వెళ్లడం గమనార్హం.


కారణం అదేనా?

ముంబై జట్టు యాజమాన్యంపై అసంతృప్తి కారణంగానే జైస్వాల్‌ గోవా వెళ్లాలన్న నిర్ణయానికి కారణమని సమాచారం. కశ్మీర్‌తో మ్యాచ్‌ సందర్భంగా జైస్వాల్‌, ముంబై జట్టు సీనియర్‌ ఆటగాడికి నడుమ గొడవ జరిగినట్టు తెలిసింది. ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ షాట్‌ ఎంపికను ఆ సీనియర్‌ ఆటగాడు ప్రశ్నించాడట. దాంతో యశస్వీ..తొలి ఇన్నింగ్స్‌లో ఆ సీనియర్‌ క్రికెటర్‌ షాట్‌ ఎంపికను ప్రస్తావించి అతడి ప్రశ్నను తిప్పికొట్టినట్టు తెలిసింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2025 | 02:39 AM