మరణం గుట్టు విప్పిన డాక్టర్.. చనిపోయిన వాళ్లను బతికించొచ్చట.
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:30 PM
కొన్ని వందల ఏళ్లుగా మరణంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చనిపోయిన తర్వాత మనిషి శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ, చనిపోయిన మనిషిని బతికించలేకపోతున్నారు. అమెరికాకు చెందని ఓ డాక్టర్ మాత్రం చనిపోయిన వాళ్లను బతికించవచ్చని అంటున్నాడు.

మనిషి జీవితానికి ఆఖరి మజిలీ మరణం అని అందరికీ తెలిసిన సంగతే. చచ్చిపోయిన మనిషి.. ప్రాణాలతో తిరిగి రాడని కూడా తెలుసు. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొన్ని వందల ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచివెళ్లిపోతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. మరణించిన వ్యక్తిని మళ్లీ బతికించడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అవి ఇంకా ప్రయోగదశల్లోనే ఉన్నాయి. అయితే.. అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్త మాత్రం చనిపోయిన వ్యక్తిని మళ్లీ బతికించవచ్చని అంటున్నాడు. న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన శ్యామ్ పర్నియా అనే శాస్త్రవేత్త మరణం మనిషి జీవితానికి అంతం కాదని అంటున్నాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘ ఇన్ని రోజులు మరణం గురించి మనకు తెలిసిన విషయాలన్నీ తప్పు. అది అంతం కాదు. చనిపోయిన మనిషిని మళ్లీ బతికించవచ్చు. చనిపోయిన తర్వాత మనిషి మెదడు కొన్ని గంటలు, రోజుల వరకు పనికి వస్తుంది. దాన్ని మళ్లీ యథాస్థానికి తీసుకురావచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా.. సైన్స్ అనేది పోస్టుమార్టం స్థితిలోకి వెళ్లిపోయింది. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం.. మనిషి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత సెల్స్ కుళ్లిపోతాయి. దాని ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత కూడా మెదడును భద్రపరచవచ్చు. మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయినా.. ఆక్సిజన్ అందకపోయినా అది పాడవుతుంది.
శరీరంలోని కణాలు పూర్తిగా పాడవనంత వరకు చనిపోయిన వ్యక్తిని.. ప్రాణాలతో తిరిగి తీసుకురావచ్చు. ఎక్ష్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్షిజన్ ( ఈసీఎమ్ఓ) మిషిన్లు, కొన్ని మందులతో చనిపోయిన వారిని తిరిగి బతికించవచ్చు’ అని అన్నారు. కాగా, సెంట్రల్ అమెరికన్ కంట్రీ హోండురాస్ తీరానికి 40 మైళ్ల దూరంలో ఉన్న రోటన్ అనే చిన్న ద్వీపంలో మరణంపై పరిశోధనలు జరిగాయి. మినీసర్కిల్ అనే బయోటెక్ కంపెనీ మరణాన్ని జయించే ఇంజెక్షన్‌ను కనిపెట్టిందట. డీఎన్ఏ అణువులను మార్చి.. నేచురల్ సెల్ఫ్- రిపేరింగ్ మెకానిజంని ఈ ఇంజెక్షన్ యాక్టివేట్ చేస్తుందట. యవ్వనంగా ఉండటానికి ప్రతీ ఏటా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న బ్రయాన్ జాన్సన్ ఈ ఇంజెక్షన్ తీసుకున్నాడట.
ఇవి కూడా చదవండి:
పాపం.. యువతి విచిత్ర జీవితం.. టాయిలెట్‌లొ అద్దెకు..
Viral Video: పిల్లల ముందే పొట్టుపొట్టు కొట్టుకున్న టీచర్లు