Google Calendar: గూగుల్ క్యాలెండర్ నుంచి ప్రైడ్ మంత్, బ్లాక్ హిస్టరీ మంత్ తొలగింపు.. వెల్లువెత్తుతున్న విమర్శలు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 03:13 PM
గూగుల్ తన క్యాలెండర్ ప్లాట్‌ఫామ్‌లో గణనీయమైన మార్పు చేసింది. చాలా సెలవులను తొలగించింది. ఇంతకు ముందు ప్రైడ్ మంత్, బ్లాక్ హిస్టరీ మంత్, హోలోకాస్ట్ రిమెంబ్రన్స్ డే వంటి ఎన్నో రోజులను గూగుల్ క్యాలెండర్ సూచించేది.

అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ (Google) తన క్యాలెండర్‌లో మార్పులు చేయడం ఆగ్రహ జ్వాలలకు కారణమవుతోంది. గూగుల్ తన క్యాలెండర్ (Google Calander) ప్లాట్‌ఫామ్‌లో గణనీయమైన మార్పు చేసింది. చాలా సెలవులను తొలగించింది. ఇంతకు ముందు ప్రైడ్ మంత్, బ్లాక్ హిస్టరీ మంత్, హోలోకాస్ట్ రిమెంబ్రన్స్ డే వంటి ఎన్నో రోజులను గూగుల్ క్యాలెండర్ సూచించేది. అయితే గూగుల్ వాటన్నింటినీ తొలగించినట్టు గత వారం చాలా మంది గమనించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. గూగుల్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు (Change in Google Calander).
తాజాగా ఈ వివాదంపై గూగుల్ స్పందించింది. గూగుల్‌ను ఎన్నో కోట్ల మంది వినియోగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా వందలాది ముఖ్యమైన రోజులను మాన్యువల్‌గా అప్‌డేట్ చేయడం, నిర్వహించడం కష్టంగా మారిందని గూగుల్ పేర్కొంది. అందువల్లనే గతేడాది మధ్య నుంచి తాము ప్రభుత్వ సెలవులు, జాతీయ ఆచారాలకు సంబంధించిన అంశాలను మాత్రమే చూపించడం ప్రారంభించినట్టు గూగుల్ పేర్కొంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ క్యాలెండర్ నుంచి ఒక రోజును తొలగించినంత మాత్రాన దాని ప్రాముఖ్యత లేదా ఉనికి చెరిగిపోదని, ప్రజలు తమ చరిత్రను మరచిపోరనిని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫెడరల్ డీఈఐ (డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్) కార్యక్రమాలను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దాంతో చాలా కార్పొరేట్ కంపెనీలు తమ పనితీరను మార్చుకుంటున్నాయి. మెటా, అమెజాన్, మెక్‌డొనాల్డ్స్, వాల్‌మార్ట్ వంటి ప్రధాన కంపెనీలు కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తమ చొరవను తగ్గించుకుంటున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తలు కోసం క్లిక్ చేయండి..