WhatsApp: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. స్టేటస్ ప్రియులకు ఇక పండగే
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:34 PM
మీరు ప్రతి రోజు వాట్సాప్‌లో స్టేటస్ పెడతారా.. అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు వాట్సాప్ స్టేటస్‌గా ఫొటో, వీడియో, టెక్స్ట్ పెట్టి.. దానికి మీకు నచ్చిన పాటలోని లిరిక్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ సరికొత్త ఫీచర్‌ను ఎలా వాడాలంటే...

యూజర్లకు మెరుగైన సేవలు అందించే విషయంలో ముందంజలో ఉంటుంది వాట్సాప్. దానిలో భాగంగా ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌ను తీసుకొస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా వాట్సాప్ మాతృ సంస్థ మెటా మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై వాట్సాప్ యూజర్లు.. తమ ప్రొఫైల్ అప్‌డేట్స్‌కు మ్యూజిక్‌ను యాడ్ చేసుకోవచ్చు. దీని గురించి శుక్రవారం నాడు మెటా ప్రకటన చేసింది. ఈ కొత్త అప్‌డేట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అప్‌డేట్ ఫీచర్ మాదిరే ఉండనుంది. అంటే ఇకపై వాట్సాప్ యూజర్లు.. తమ స్టేటస్‌లలో పెట్టే ఫొటోలు, టెక్ట్స్, వీడియోలకు తమకు నచ్చిన పాటలను యాడ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
ఇకపై మీరు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాలనుకుంటే.. మీ ఫోన్ స్క్రీన్ పైభాగంలో మ్యూజిక్ నోట్ ఐకాన్ కనిపించనుంది. మీరు దాని మీద క్లిక్ చేసి.. మీకు నచ్చిన పాటను మీ స్టేటస్‌కు యాడ్ చేసుకోవచ్చు.వాట్సాప్‌లోని ఈ ఫీచర్.. మెటా ఇతర ప్లాట్‌ఫామ్స్ మాదిరే ఉండనుంది. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన తేడా ఏంటంటే.. స్టేటస్‌లో షేర్ చేసిన మ్యూజిక్ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పాటలను చూడగలరు.. వాట్సాప్ చూడలేదు.
వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలంటే..
ముందుగా వాట్సాప్ ఒపెన్ చేసి.. అప్‌డేట్స్ మీద క్లిక్ చేయాలి.
తర్వాత కెమరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే.. కొత్త స్టేటస్ యాడ్ చేయడానికి.. యాడ్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత గ్యాలరీ నుంచి లేదంటే.. అప్పటికప్పుడు ఫొటో దిగి.. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
తర్వాత పైన ఉన్న మ్యూజిక్ ఐకాన్ మీద ట్యాప్ చేసి.. మ్యూజిక్ లైబ్రరీని ఓపెన్ చేయండి.
అనంతరం మీకు నచ్చిన పాటను సెలక్ట్ చేసుకుని.. దానిలో ఏ లిరిక్స్ మీ స్టేటస్‌కు యాడ్ చేయాలనుకుంటున్నారో.. ఆ ట్రాక్ వరకు సెలక్ట్ చేసుకొండి.
ఫొటోకు అయితే.. సాంగ్ 15 సెకండ్స్ వరకు ప్లే అవుతుంది
అదే వీడియో అయితే.. 60 సెకండ్స్ వరకు ప్లే అవుతుంది.
అలానే ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ ఫీచర్ మాదిరే ఇక్కడ కూడా లైసెన్స్డ్ ట్రాక్స్ మాత్రమే ఉంటాయి. యూజర్లు తమ సొంత పాటను అప్‌లోడ్ చేసేదుకు అనుమతి లేదు.
ఇవి కూడా చదవండి:
భూకంపాన్ని ముందే తెలుసుకోండి..మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకుంటే చాలు..
ఫోన్ పే, గూగుల్ పే చేస్తున్నారా?.. మీ పని అవుట్..