కలెక్టరేట్ ప్రజావాణికి 35 ఫిర్యాదులు
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:22 PM
కలెక్టరేట్ ప్రజావాణికి 35 ఫిర్యాదులు35 complaints to Collectorate Prajavani
నాగర్‌కర్నూల్ టౌన్, ఏప్రి ల్ 21 (ఆంధ్రజ్యోతి) : cవివిధ సమస్యలపై ప్రజ ల నుంచి అందిన వినతులను కలెక్టరేట్ పరిపాలనాధికారి చంద్రశేఖర్ స్వీకరించి పరిశీల న అనంతరం విచారణ కోసం సంబంధిత శాఖల అధికారు లకు బదిలీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్ట డంతో పాటు క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కా రం కోసం సంబంధిత మండలాలకు బదిలీ చే యాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో...
నాగర్‌కర్నూల్ క్రైం : ఫిర్యాదుదారుల సమ స్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ సముదాయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 9ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు.