Share News

సంక్షోభాలన్నీ రాజకీయ సమస్యలే

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:15 AM

: హక్కుల ఉల్లంఘనకు, పాలకుల నమూనా వల్ల వచ్చే సంక్షోభాలన్నీ రాజకీయ సమస్యలే అని మానవహక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ పి. సుబ్బారావు అన్నారు.

సంక్షోభాలన్నీ రాజకీయ సమస్యలే
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

మిర్యాలగూడ, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): హక్కుల ఉల్లంఘనకు, పాలకుల నమూనా వల్ల వచ్చే సంక్షోభాలన్నీ రాజకీయ సమస్యలే అని మానవహక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ పి. సుబ్బారావు అన్నారు. మధ్యభారతంలో ఆదివాసీల హత్యాఖాండాను నిరసిస్తూ నల్లగొండ, గాంధీనగర్‌లో 19న జరిగే ఉమ్మడి జిల్లా సదస్సు కరపత్రాన్ని వివిధ సంఘాల నాయకులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం ఆవిష్కరించారు. మధ్యభారత దేశంలోని అటవీప్రాంతంలో 18 రకాల విలువైన ఖనిజాలను బడా కార్పొరే ట్లకు, పెట్టుబడిదారి సంస్థలకు కట్టబెట్టేందుకు ఆదివాసులను అడవులనుంచి తరిమి వేసేందుకు ప్రభుత్వం సైనిక బలగాలను దించిందన్నారు. తీవ్రమైన హింసాకాండను అమలు చేస్తూ వందల సంఖ్యలో ఆదివాసుల హననానికి పాల్పడుతతున్నారని అన్నారు. తమ దేశ పౌరులపై తామే యుద్దం ప్రకటించినట్లు ప్రభుత్వం చెప్పుకోవడం దుర్మార్గమ న్నారు. ఆదివాసీల హత్యాఖాండను పౌర ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాల న్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కో-ఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, డీటీఎఫ్‌ నాయకులు వై. బిక్షమయ్య, డి.గణేష్‌, ముస్లిం విద్యావంతుల వేదిక నాయకులు మౌజం హుప్పేన్‌, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు బి. రామయ్య, కిరణ్మయి, కుందా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:16 AM