సింగరేణి సిగలో మరో మైలురాయి...
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:38 PM
బొగ్గు ఉ త్పత్తిలో రారాజు సింగరేణి మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. తన 13 దశాబ్దాల చరిత్రలో తొ లిసారిగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలను బుధవారం ఎట్టకేలకు ప్రారంభించింది.
-ఇతర రాష్ట్రాలలో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం
-ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్‌ను ప్రారంభించిన సంస్థ
-ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం
-38 ఏళ్లపాటు ఉత్పత్తి అంచనా
మంచిర్యాల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): బొగ్గు ఉ త్పత్తిలో రారాజు సింగరేణి మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. తన 13 దశాబ్దాల చరిత్రలో తొ లిసారిగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలను బుధవారం ఎట్టకేలకు ప్రారంభించింది. ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌ను బుధవారం డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వర్చు వల్‌గా ప్రారంభించారు. ఇప్పటి వరకు తెలంగాణ రా ష్ట్రానికే పరిమితం అయిన బొగ్గు ఉత్పత్తిని సింగరేణి ఇతర రాష్ట్రాలకు విస్తరించి చారిత్రాత్మక ఘట్టానికి తెర లేపింది. కాగా నైనీ బొగ్గు బ్లాక్ వల్ల అంగూల్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు కూడా మెరుగు పడను న్నాయి. అక్కడ 1600 మెఘావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే యోచనలో సిం గరేణి యాజమాన్యం ఉంది.
సుదీర్ఘ నిరీక్షణ తరువాత....
నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభానికి సుదీర్ఘ నిరీక్షణ త రువాత ఎట్టకేలకు మోక్షం లభించింది. వివిధ రకా ల అనుమతులు లభించడంలో జాప్యం కారణంగా సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. 2016 మేలో ఈ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణికి కేటాయిం చింది. అన్ని రకాల అనుమతులు సాధించి, గనిలో తవ్వకాలు ప్రారంభించడానికి తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో కేంధ్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. డిప్యూటీ సీఎం భట్టి పలుమార్లు ఒడిశాలో పర్యటించి, అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపడంతో తొమ్మిదేళ్ల కల సాకారం అయింది. దీం తో సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్ చేతికిరాగా, అ ధిక ఉత్పత్తికి బాటలు పడ్డాయి. ప్రస్తుతం ఒడిశా లో అడుగుపెట్టిన సంస్థ, భవిష్యత్తులో ఇతర రాష్ట్రా లకూ విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
పది మిలియన్ టన్నుల ఉత్పత్తికి అవకాశం....
నైనీ బొగ్గు బ్లాక్‌లో పది మిలియన్ టన్నుల ఉత్ప త్తికి అవకాశం ఉంది. గనిలో 340.78 మిలియన్ ట న్నుల బొగ్గు నిల్వలు తవ్వి తీసేందుకు వెసులుబా టు లభించింది. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 17 ఓపెన్ కాస్టుగనుల కన్నా నైనీ బొగ్గుబ్లాక్ అతి పెద్దది కానుంది. ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38 ఏళ్ల పాటు గని నుంచి బొగ్గును తవ్వి తీయనున్నా రు. తెలంగాణలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో ఒక టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 లక్షల ఓవర్ బర్డెన్ (మట్టి) తొలగిస్తుండగా, నైనీ గనిలో మాత్రం టన్ను బొగ్గుకు కేవలం రెండున్నర క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీస్తే సరిపోతుంది. ఈ కారణంగా నైనా బ్లాక్ సింగరేణికి లాభదాయకమైందనే అభిప్రా యాలు ఉన్నాయి.
అందుబాటులో నాణ్యమైన బొగ్గు...
నైనీ బ్లాక్‌లో మేలైన జీ-10 రకం నాణ్యమైన బొగ్గు లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. గనిలో ఓవ ర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు తవ్వకాలు, రవాణాకు సంబంధించి ఇప్పటికే కాంట్రాక్టర్లకు పనులు అప్ప గించగా, ఇక బొగ్గు తవ్వకాలే చేపట్టవలసి ఉంది. నై నీ గనిలో ఉత్పత్తి అయ్యే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గంలో సమీపంలోని జరపడ రైల్వే సైడింగ్‌కు రవాణా చేసి, అక్కడి నుంచి వినియోగదారులకు స రఫరా చేయనున్నారు. ఇదిలా ఉండగా, భవిష్యత్తులో ఆ ప్రాంతంలో గల ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి 60 కిలోమీటర్ల మేర ప్రత్యేక రైలు మార్గాన్ని నిర్మించే యోచన కూడా ఉంది. రాబోయే మూడేళ్లలో రైలు మార్గం కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. నైనీ బొగ్గు బ్లాక్ కోసం మొత్తం 2255 ఎకరాల భూ మిని సేకరించారు. ఇందులో 1935 ఎకరాలు అటవీ ప్రాంతం కాగా, 320 ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేటు భూమి. బొగ్గు తవ్వకాల కోసం ఆయా వర్గాల నుం చి సింగేణి యాజమాన్యం ఇప్పటికే అవసరమైన అ నుమతులు సాధించడంతో నైనీ బ్లాక్‌లో బొగ్గు తవ్వ కాలకు ఆటంకాలు తొలగిపోయాయి.