రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:30 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హుత కలిగిన ప్రతి ఒక్క రు అన్‌లైన్ ద్వారా ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్గిక్యూటివ్ డైరెక్టర్ జిల్లా అధికారి, మండల ప్రత్యేకా ధికారి దుర్గప్రసాద్ సూచించారు.
దండేపల్లి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హుత కలిగిన ప్రతి ఒక్క రు అన్‌లైన్ ద్వారా ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్గిక్యూటివ్ డైరెక్టర్ జిల్లా అధికారి, మండల ప్రత్యేకా ధికారి దుర్గప్రసాద్ సూచించారు. శుక్రవారం దండేపల్లి మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తు దారుల సేవా కేంద్రాన్ని ఆయన సందర్శించి దరఖాస్తులను స్వీక రించారు. అనంతరం మండలస్ధాయి అధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించారు. అధికారులు గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోని వారి సమస్యలను పరిష్క రించే విధంగా చూడాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు అందుబాటు ఉండి మంచి సేవలు అందించాలన్నారు. రే షన్‌కార్డు ఉన్న వారు ఆదాయం సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవ సరం లేదన్నారు. రేషన్ కార్డు లేని వారు ఆదాయం సరిఫికెట్ స మర్పించాలన్నారు. రూ. 510వేల లోపు రుణానికి వందశాతం, రూ లక్షలోపు రుణానికి 90శాతం రాయితీ, పదిశాతం బ్యాంకు రుణం, లక్ష నుంచి 2లక్షల లోపు రుణానికి 80శాతం రాయితీ, 20శాతం బ్యాంకు రుణం, ఆదేవిధంగా 2లక్షల నుంచి 4లక్షల రుణానికి 70 శాతం రాయితీ 30శాతం బ్యాంకు ద్వారా రుణం అందిస్తున్నామన్నారు. అన్‌లైన్ ధ్వారా చేసి ఆ దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్ల తో ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్ సఽంధ్యరాణి, ఎంపీడీవో ప్రసాద్ పాల్గొన్నారు.