బెట్టింగ్‌కు పాల్పడిన నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:10 AM
ఐపీఎల్ మ్యా చ్ బెట్టింగ్‌కు పాల్పడిన పలువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ చరమందరాజు తెలిపారు.
బెట్టింగ్‌కు పాల్పడిన నిందితుల అరెస్ట్
సమావేశంలో మాట్లాడుతున్న సీఐ చరమందరాజు
హుజూర్‌నగర్ , ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ మ్యా చ్ బెట్టింగ్‌కు పాల్పడిన పలువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ చరమందరాజు తెలిపారు. సూర్యాపేట జి ల్లా హుజూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ని ర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ వెల్లడించారు. హుజూర్‌నగర్ పట్టణానికి చెంది న పాన్‌షాప్ యజమాని షేక్ ఖలీముద్దీన్ అలియాస్ హలీమ్, షేక్ ఆయూబ్, తిరుమలశెట్టి రామ్మోహన్‌రావు, సామల నర్సింహారెడ్డి, హుజూర్‌నగర్ మండలం అమరవరం గ్రామానికి చెందిన పొట్టెపంగు కోటయ్య, విజయవాడలోని ఊర్మిళనగర్‌కు చెందిన పొట్టి కోటయ్య, మేళ్లచెరు వు మండలం నల్లబండగూడెంకు చెందిన తొడేటి గోపీకృష్ణ, గరిడేపల్లి మండలం రాయినిగూడెంకు చెందిన వాడపల్లి న ర్సింహారావు సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారి సెల్‌ఫోన్లలో పలు బెట్టింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ యాప్‌ల ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్, ఇంటర్నేషనల్ లెవల్‌లో జరిగే ఆటలపై బాల్ టూ బాల్, పవర్ ప్లే, మ్యాచ్ మొత్తానికి, బ్యాట్‌మెన్ ఎంత రన్స్, ఎంత చేస్తాడని ఆన్‌లైన్ లో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. వీరందరూ ఉమ్మడిగా బెట్టింగ్‌కు పాల్పడుతూ వ చ్చిన లాభాన్ని పంచుకుంటున్నారు. ఈ సంఘటనపై ఆదివా రం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ 11, రాయల్ ఛాలెంజర్స్ బెం గుళూరు ఐపీఎల్ మ్యాచ్‌కు బెట్టింగ్ పెట్టాలని వీరందరూ పట్టణంలోని నల్లగొండ పాన్‌షాప్ వద్దకు చేరుకుని తొడేటి గోపికృష్ణ, రామ్మోహన్‌రావు, వాడపల్లి నర్సింహారావులకు సెల్‌ఫోన్లలో బెట్టింగ్ పెట్టడం రానందున వారు కోటయ్యకు డ బ్బులు ఇచ్చి అతని ఐడీ ద్వారా బెట్టింగ్ పెట్టారు. వీరందరూ ఆన్‌లైన్‌లో బెట్టింగ్ కాస్తున్నారు. విశ్వసనీయ సమచాచారం మేరకు పోలీసులు వారందరినీ పట్టుకున్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్ చే సినట్లు సీఐ చరమందరాజు తెలిపారు. వారి వద్ద నుంచి సె ల్‌ఫోన్లు, 3,400నగదు, బెట్టింగ్‌యా ప్‌లో ఉన్న రూ.66,067 రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. యువకులు డ బ్బులు సులువుగా సంపాదించాలనే ఆశతో చెడు వ్యసనాల కు బానిసై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సీఐ తెలిపారు.