Share News

మావోయిస్టులతోనే వెనకబాటుతనం

ABN , Publish Date - Apr 18 , 2025 | 11:20 PM

గతంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపా లతోనే ఈ ప్రాంతం వెనకబాటు తనానికి గురైందని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నా రు. శుక్రవారం స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు.

మావోయిస్టులతోనే వెనకబాటుతనం
సమావేశంలో మాట్లాడుతున్న జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు

జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు

చెన్నూరు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : గతంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపా లతోనే ఈ ప్రాంతం వెనకబాటు తనానికి గురైందని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నా రు. శుక్రవారం స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. గురువారం రాత్రి చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, భీమారం మండలా ల్లోని పలు గ్రామాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు వ్యతిరేకంగా వాల్‌ పోస్టర్లు వెలి శాయన్నారు. వెలిసిన వాల్‌ పోస్టర్లపై ప్రాథమిక విచారణ చేపట్టగా ఆదివాసీ సంఘం నాయకులు పోస్టర్లు వేసినట్లు తెలిసిందన్నారు. మావోయిస్టులు ముఖ్యంగా ఆదివాసీల ను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. పదేళ్ల క్రితం మావోయిస్టు కార్యక లాపాల మూలంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. మావోయిస్టు సిద్ధాంతాల కు కాలం చెల్లిందన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టులను ఏరి వేస్తు న్నారన్నారు. మావోయిస్టు పార్టీలోకి ఎవరు వెళ్లకూడదన్నారు. ఎవరైనా పార్టీ కార్యాక లాపాల్లో పాల్గొంటే స్వచ్చందంగా లొంగి పోవచ్చని సూచించారు. వారికి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మావోయిస్టులపై తిరు గుబాటు చేయాలని పిలుపునిచ్చారు. వాల్‌ పోస్టర్లు వేసిన ఆదివాసీ యువకులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో చెన్నూరు, రూరల్‌ సీఐలు దేవేందర్‌రావు, సుధాకర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 11:20 PM