Share News

Bandi Sanjay: బియ్యం ఖర్చంతా కేంద్రానిదే

ABN , Publish Date - Mar 31 , 2025 | 06:09 AM

కేంద్రం ఖర్చు చేస్తున్నప్పటికీ సన్నబియ్యం పంపిణీని స్వాగతిస్తున్నామని బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మజ్లిస్‌కు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌పై కేసుల విషయంలో కాంగ్రెస్‌ యూటర్న్‌ తీసుకుందని విమర్శించారు.

Bandi Sanjay: బియ్యం ఖర్చంతా కేంద్రానిదే

మేం రూ.40 చెల్లిస్తే.. రాష్ట్రానిది రూ.10లే

బీఆర్‌ఎ్‌సపై కేసుల్లో కాంగ్రెస్‌ యూటర్న్‌

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

కరీంనగర్‌, హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీని స్వాగతిస్తున్నామని, అయితే బియ్యం ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని, కిలోకు కేంద్ర ప్రభుత్వం రూ.40లు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.10లు మాత్రమే భారం పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉంటూ మజ్లి్‌సను గెలిపించేందుకు సిద్ధమయ్యాయన్నారు. బీజేపీకి సరిపడా బలం లేక పోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నదని తెలిపారు. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. బీఆర్‌ఎ్‌స, కేసీఆర్‌లపై కేసుల విషయమై కాంగ్రెస్‌ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందని విమర్శించారు. టెర్రరిస్టులకు అడ్డాగా దారుస్సలాం మారిందని ఆరోపించారు. ఒవైసీ కుటుంబ వ్యాపారాలు కాపాడుకునేందుకు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అమ్ముడుపోయే పార్టీ మజ్లిస్‌ అని, దానికి తెలంగాణ అంతటా పోటీ చేసే దమ్ము లేదని బండి సంజయ్‌ విమర్శించారు. సెంట్రల్‌ వర్శిటీ విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అమానుషమని బండి సంజయ్‌ అన్నారు. పోలీసు బలగాలను ఉపయోగించి విద్యార్థులను భయాందోళనలకు గురిచేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉందని మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 06:09 AM