Share News

దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:34 PM

దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలని కోరుతూ బుధవారం మంచిర్యాల పట్ట ణంలోని ఐబీ చౌరస్తా నుంచి హాజీపూర్‌ మండల కేంద్రం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు పాదయాత్ర చేపట్టారు.

దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలి
పాదయాత్ర చేస్తున్న జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలని కోరుతూ బుధవారం మంచిర్యాల పట్ట ణంలోని ఐబీ చౌరస్తా నుంచి హాజీపూర్‌ మండల కేంద్రం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌, రఘునందన్‌ మా ట్లాడుతూ జన గణన పట్టికలో 34 కాలమ్‌లు ఉన్నాయని, కుల గణ నను చేరిస్తే అదనంగా ఒక కాలం మాత్రమే చేరుతుందని, దీనికి రూ పాయి కూడా ఖర్చు కాదన్నారు. కుల గణన చేపడితే చట్టసభల్లో బీసీ లకు 50 శాతం రిజర్వేషన్‌లు కల్పించాల్సి వస్తుందని కేంద్ర పాల కు లు బావిస్తూ చేయడం కుల గణన చేపట్టడం లేదన్నారు. ఇప్పటి కైనా బీసీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించాలని లేకుం టే పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకు లు భీమ్‌సేన్‌, రాములు, రాజేశం, సతీష్‌, రాములు, వేణుగోపాల్‌, సతీ ష్‌, సంతోష్‌, అంజన్న, భీమ్‌రావు, శంకర్‌, రాజేశం పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:34 PM