Share News

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:38 PM

రాష్ట్ర ప్ర భుత్వం ప్రజల దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్క రించేందుకే విప్లవాత్మకమై న భూ భారతి చట్టం రూ పొందించిందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు.

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం
ఊర్కొండలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయేందిర బోయి

- జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయేందిర బోయి

ఊర్కొండ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్ర భుత్వం ప్రజల దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్క రించేందుకే విప్లవాత్మకమై న భూ భారతి చట్టం రూ పొందించిందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు. భూ భారతి చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గతంలో సరియైునా రిజిస్త్రేషన్‌ లేకుండా జరిగిన సాదా బైనామాలను క్రమబద్ధీకరించుకోవచ్చని, అంతే కాకుండా వారసత్వ భూముల విషయంలో నెల కొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిం చ డానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుం దని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అడిష నల్‌ కలెక్టర్‌ అమరేందర్‌, ఆర్డీవో శ్రీను, తహసీ ల్దార్‌ యూసుఫ్‌ అలీ, ఎంపీడీవో కృష్ణయ్య, ఏవో దీప్తి, ఆలయ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, నా యకులు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, మ్యాకల శ్రీనివాసులు రమేష్‌నాయక్‌, అబ్దుల్‌సమి, ఆదినారాయణ, అయూబ్‌పాష, మనోహర్‌రెడ్డి, జంగారెడ్డి, రఫిక్‌ తదితరులు ఉన్నారు.

భూ భారతిని సద్వినియోగం చేసుకోవాలి

ఉప్పునుంతల : భూ భారతి-2025 చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ అమరేందర్‌ అ న్నారు. మంగళవారం ఉప్పునుంతలలోని రైతు వేదికలో భూ భారతి పై అవగాహన సదస్సు నిర్వహంచారు. రికార్డు ల్లో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ర్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఎలా పొందాలనే అం శాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్య క్రమంలో డీసీవో రఘనాథరావు, సూపరింటెం డెంట్‌ మధు, ఏడీ హరికృష్ణ, ఏవో రమేష్‌, తహసీల్దార్‌ ప్రమీల, నాయకులు అనంతరెడ్డి, నర్సింహారెడ్డి నర్సింహారావు, ఉన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 11:38 PM