Share News

అధిక వడ్డీ పేరిట బడా మోసం

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:10 AM

అధిక వడ్డీ పేరిట బడా మోసం జరిగింది. అమాయకుల ఆశలను ఆసరాగా తీసుకొని నిలువునా ముంచారు.

 అధిక వడ్డీ పేరిట బడా మోసం
నల్లగొండ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం ఎదుట బాధితులు

అధిక వడ్డీ పేరిట బడా మోసం

విప్స్‌ యాప్‌తో కుచ్చు టోపీ

కోట్లలో పెట్టుబడులు పెట్టిన అమాయకులు

మోసపోయామని తెలిసి పోలీసులకు ఫిర్యాదు

నల్లగొండ, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీ పేరిట బడా మోసం జరిగింది. అమాయకుల ఆశలను ఆసరాగా తీసుకొని నిలువునా ముంచారు. వి ప్స్‌ యాప్‌ పేరిట మహారాష్ట్రలోని పూణె కేంద్రం గా ఈ విప్స్‌ యాప్‌ను 2018 సంవత్సరంలో ప్రా రంభించినట్లు తెలుస్తుంది. దేశంలోని వివిధ ప్రాం తాల్లో, రాషా్ట్రల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల ను నిలువునా ముంచిన సదరు సంస్థ హైదరాబాద్‌లో కూడా మొదలు పెట్టి జిల్లాల్లో బ్రాంచీలను ప్రారంభించారు. ఈ క్రమంలో నల్లగొండలో కూడా బ్రాంచీ ఓపెన చేయడంతో దాదాపు 300మంది ఈ కంపెనీ గ్రూపులో చేరారు. ఉమ్మడి జిల్లాలో 700 మంది వరకు సభ్యులు ఉన్నట్లు సమాచారం. యా ప్‌లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామని అ మాయకులను బురిడీ కొట్టించారు. ఈ మోసపోయిన వారిలో సాధారణ ప్రజలతో పాటు పోలీసు లు కూడా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒక రి ద్వారా ఒకరూ చైన సిస్టమ్‌లో పెట్టుబడులు పె ట్టారు. సంవత్సరం, రెండేళ్ల పాటు వడ్డీ సక్రమంగా ఇచ్చి నమ్మపలికిన నిర్వాహకులు కొన్ని నెలలుగా చేతులు ఎత్తివేయడంతో బాధితులు మోసపోయామని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డిని బాధితులు అధిక సంఖ్యలో ఆశ్రయించి తమకు జరిగిన నష్టా న్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉదాహరణకు లక్ష రూపాయల నగదును వ్యాపారంలో పెడితే నెలకు రూ.3ను వడ్డీగా ఆశ చూపించారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తమకు ఉన్నపాటి ఆస్తులను సైతం అమ్ముకుని పెట్టుబడులు పెట్టారు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బు వ స్తుందన్న ఆశతో అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టారు. కొన్ని నెలలుగా వడ్డీ రాకపోవడంతో పా టు యాప్‌ను కూడా బ్లాక్‌ చేయడంతో ఈ తతం గం వెలుగులోకి వచ్చింది. బాఽధితుల ఫిర్యాదుతో నల్లగొండ పోలీసులు పూణెలోని నిర్వాహకులను సంప్రదించడంతో రెండేళ్లలో ఇబ్బందులు తొలగిపోతాయని, ప్రతి ఒక్కరికి బాండ్‌ ఇస్తామని నమ్మపలికినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రెండు రోజుల్లో బాధితులకు న్యాయం చేయకపోతే శాఖాపరంగా, చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఏజెంట్లు, డైరెక్టర్ల మాటలు నమ్ముకొని నల్లగొండ పట్టణంతో పాటు నల్లగొండ, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాలో అనేక మంది అమాయకులు విప్స్‌ యాప్‌తో మోసపోయినట్లు స్పష్టం అవుతుంది.

Updated Date - Apr 19 , 2025 | 12:10 AM