భూభారతి చట్టంపై సందేహాల నివృత్తి
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:11 AM
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఆర్వోఆర్ భూభారతి చట్టంపై రైతులకు, ప్రజలకు ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని నాగారం రైతు వేదికలో
మంథని రూరల్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఆర్వోఆర్ భూభారతి చట్టంపై రైతులకు, ప్రజలకు ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని నాగారం రైతు వేదికలో బుధవారం ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో వివిధ అంశాలను కలెక్టర్ శ్రీహర్ష రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసమస్యలపై అధికారులు అందిందచిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆర్డీవో నిర్ణయం కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యూనల్ వద్ద ఆప్పీల్ చేసుకోవచ్చన్నారు. గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంత రాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండే దని నేడు అప్పీల్‌కు అవకాశం కల్పించిందన్నారు. అప్పీల్ తీర్పు తర్వాత కూడి సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చన్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహా లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల ను తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాల్లో రికార్డులను ప్రదర్శించ డం జరుగుతుందన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. మనిషికి ఆధార్ కార్డులా భూమికి భూధార్ సంఖ్య కేటాయిం పు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం ఆవకాశం కల్పించిందన్నారు. పీవోటీ, ఎల్‌టీఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, వంద రూపాయాల అప రాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తా మన్నారు. అప్పుల రికార్డులను, వివరాలను నమోదు చేసి పాసుబుక్ జారీ చేస్తామ న్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటే షన్ ఒకే రోజు ఉంటాయన్నారు. కొనుగోలు, దానం, తనఖా బదిలీ పంపకాల ద్వారా భూమిపై హక్కు లు సంక్రమిస్తే తహశీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదారు పాసుబుక్ జారీ చేస్తార న్నారు. వారసత్వం, వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహశీల్దార్ విచా రణ జరిపి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణయిత గడువులోగా పూర్తి చేయకుంటే ఆటోమెటిక్‌గా మ్యూ టేషన్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సురేష్, తహశీల్దార్ కుమారస్వామిలు పాల్గొన్నారు.