Share News

కేంద్ర నిధులతోనే జాతీయ రహదారుల నిర్మాణం

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:11 PM

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే జిల్లా కేంద్రానికి నాలుగు వైపులా జాతీయ రహదారుల ని ర్మాణం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పే ర్కొన్నారు.

కేంద్ర నిధులతోనే జాతీయ రహదారుల నిర్మాణం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

చెన్నూరు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే జిల్లా కేంద్రానికి నాలుగు వైపులా జాతీయ రహదారుల ని ర్మాణం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పే ర్కొన్నారు. సోమవారం చెన్నూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్‌ హైవే నెంబరు 63 జగ్దల్‌పూర్‌ టూ నిజా మాబాద్‌ పనులను పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ రహదారికి నిజా మాబాద్‌ జిల్లా ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు రూ. 3376 కోట్లతో రో డ్డు విస్తరణ పనులను చేపట్టిందన్నారు. మరో వైపు శ్రీరాంపూర్‌ నుంచి కొ మురంభీం జిల్లా వాంకిడి వరకు నేషనల్‌ హైవే 363 రూ. 2497 కోట్లతో అమెరికా స్థాయి రోడ్లను తలపించేలా కేంద్రం చేపట్టిందన్నారు. మరో వై పు జిల్లా కేంద్రం నుంచి జైపూర్‌ మీదుగా వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప నులు రూ. 2606 కోట్లతో ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ రోడ్డు పూ ర్తయితే మంచిర్యాల నుంచి వరంగల్‌ వరకు 2 గంటల్లో చేరుకోవచ్చ న్నా రు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి పనులను తామే చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటు న్నా యని, వీటిని ప్రజలు నమ్మవద్దన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో మంచిర్యాల జిల్లాకు ఒరిగిందేమి లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌, పట్టణాధ్యక్షుడు జాడి తిరుపతి, మండల అధ్యక్షుడు రాజశే ఖర్‌గౌడ్‌, నాయకులు శ్రీపాల్‌, శివకృష్ణ, వంశీకృష్ణగౌడ్‌, రాజు, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:11 PM