Kanch Gachibowli: ఆ భూములు వర్సిటీ స్వాధీనంలోనే ఉన్నాయా
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:02 AM
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి సంబంధించి వివాదం ఉత్పన్నమైంది. ప్రభుత్వానికి సంబంధించిన ఆధారాల ప్రకారం, ఈ భూమి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి గోపన్‌పల్లిలోని 397 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, రెవెన్యూ రికార్డుల ప్రకారం, గోపన్‌పల్లి సర్వే నంబర్లలో ఉన్న 884 ఎకరాల భూమిలో 477 ఎకరాలను టీఎన్జీవోలు మరియు వివిధ సంస్థలకు కేటాయించబడ్డాయి.
సర్వే నంబరు 36, 37ల్లో ఉన్నదెంత? పంచిందెంత!?
ఇక్కడే 477 ఎకరాలు టీఎన్జీవోల ఇళ్ల స్థలాలకు పంపిణీ
దాపు 250 ఎకరాలు టీఐఎ్‌ఫఆర్‌కు.. 20 ఎకరాలు లాయర్లకు
మిగిలిన భూమిపై దృష్టిసారించిన ప్రతిపక్షాలు, సంఘాలు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని.. అందుకు బదులుగా గోపన్‌పల్లిలోని సర్వే నంబర్లు 36, 37ల్లో 397 ఎకరాలను అప్పటి ప్రభుత్వం హెచ్‌సీయూకు స్వాధీనపరిచిందని, దానిపై అప్పటి రిజిస్ట్రార్ వై.నర్సింహులు సంతకం చేశారంటూ ప్రభుత్వం ఒక ఆధారాన్ని విడుదల చేసింది. సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రులూ ఇదే విషయం చెప్పారు. మరి, ఆ 397 ఎకరాలూ ఇప్పుడు యూనివర్సిటీ అధీనంలోనే ఉన్నాయా!? అయితే.. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం ఎందుకు!? ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. నిజానికి, గోపనపల్లి సర్వే నంబర్లు 36, 37ల్లో 884 ఎకరాలు ఉన్నాయని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. వీటిలో 477 ఎకరాలను 1991లోనే టీఎన్జీవోలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయుంచారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వివిధ సంస్థలకు ఇక్కడ కేటాయింపులు చేశాయి. ఇక్కడే టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చి (టీఐఎ్‌ఫఆర్) ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 250 ఎకరాలను కేటాయించారు. ఇక, ఈ సర్వే నంబర్లలో 90 ఎకరాలు తనదంటూ ఓ ప్రైవేటు వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఇక్కడే ఒక రిసెర్చి ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
లాయర్ల సంఘానికి 20 ఎకరాలు కేటాయించారు. ఈ కేటాయింపులన్నిటినీ పరిశీలిస్తే.. ఆయా సర్వే నంబర్లలో యూనివర్సిటీకి కేటాయించిన భూమి ఉందా!? అది వర్సిటీ అధీనంలోనే ఉందా!? అనే అనుమానాలను పర్యావరణవేత్తలు, ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఎన్ని ఎకరాల భూములు మిగిలి ఉన్నాయనే అంశాన్ని తేల్చే విషయంపై దృష్టి సారించాయి. నిజానికి, విశ్వ విద్యాలయానికి భూములు స్వాధీనం చేసినా.. ఈ భూములపై వర్సిటీకి చట్టబద్ధమైన హక్కులు లేకపోవడం.. ప్రభుత్వానికే సర్వ హక్కులు ఉండడంతో పలు సంస్థల ఏర్పాటుకు, పరిశ్రమలకు, ప్రభుత్వ అవసరాలకు ఇక్కడి భూమినే కేటాయిస్తూ వస్తోంది. అయితే, ఇక్కడి భూముల్లో వర్సిటీకి ఎన్ని ఎకరాలకు చట్టబద్ధత కల్పించాలనే అంశంపై 2016లో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బృందంతో ప్రభుత్వం అధ్యయనం చేయించింది. వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు కూడా!!
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News