Share News

ఆందోళన చెందొద్దు..ప్రతీ గింజను కొంటాం

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:20 PM

అకాల వర్షం తో తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఆందోళన చెందొద్దు..ప్రతీ గింజను కొంటాం
నాగర్‌కర్నూల్‌ వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన మొక్కజొన్నను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన ధాన్యం పరిశీలన

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ బిజినేపల్లి/ తిమ్మాజి పేట, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : అకాల వర్షం తో తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ వ్యవసా య మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే తడిసి న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు న్యాయం జరి గేలా చూస్తానని హామీ ఇచ్చారు. విపక్షాల వి మర్శలు మానుకొని రైతులకు అండగా నిలవా లని హితవు పలికారు. ఎమ్మెల్యే వెంట మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, డైరెక్టర్లు, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

ఫ బిజినేపల్లి మండలంలోని వివిధ గ్రా మాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని, నే లకు ఒరిగిన వరి, మొక్కజొన్న పంటలను పరి శీలించి ప్రభుత్వం నుంచి పరిహారం అందిం చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలరాజుగౌడ్‌, ఐకేపీ ఏపీఎం విజయ, సీసీ ప్రశాంత్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, కృష్ణ య్య, గోవిందు నాయక్‌, పూల్యానాయక్‌, పాం డు నాయక్‌ ఉన్నారు.

ఫ తిమ్మాజిపేట మండలంలోని బుద్దస ముద్రం, ఆవంచ గ్రామాల్లో సోమవారం సింగి ల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలల్లో వరిని అమ్మి ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధర పొందాలన్నారు. నాయకులు ఉన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:20 PM