మలేరియా నిర్మూలనకు కృషి
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:13 PM
జిల్లాలో మలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నామని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ పేర్కొన్నారు. ప్రపంచ మ లేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల పట్ట ణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో అవగాహన ర్యాలీని ఆయన ప్రా రంభించారు.
-డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్
గర్మిళ్ల, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నామని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ పేర్కొన్నారు. ప్రపంచ మ లేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల పట్ట ణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో అవగాహన ర్యాలీని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ దోమల బెడద లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహ న కల్పిస్తున్నామన్నారు. పారిశుధ్య సిబ్బంది నీటి నిల్వ ఉన్న ప్ర దేశా లను గుర్తించి శుభ్రం చేయాలని, దోమలు గుడ్లు పెట్టకుండా నీటి నిల్వ ప్రదేశాలను వారానికి ఒకసారితీసివేయాలన్నారు. వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలన్నారు. జిల్లాలో 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 23,375 మందికి పరీక్షలు చేశామని, ఒకరికి మాత్రమే మలేరియా ని ర్ధారణ అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌లు అనిత, శివ ప్ర తాప్, అశోక్, సునీత, అమర్, రాము, రజిత, సబ్ యూనిట్ అధికారు లు నాందేవ్, జగదీష్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్ అధికారి మూర్తి, సుమన్, పద్మ పాల్గొన్నారు.