భూ భారతి చట్టాన్ని ప్రతీ రైతు తెలుసుకోవాలి
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:52 PM
భూసమస్యల పరి ష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టం గురించి ప్రతి రైతు తెలుసుకోవాలని కలె క్టర్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కన్నెపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన ఆర్‌వోఆర్ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ మోతిలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణలతో కలిసి హాజరయ్యారు.
కలెక్టర్ కుమార్ దీపక్
కన్నెపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : భూసమస్యల పరి ష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టం గురించి ప్రతి రైతు తెలుసుకోవాలని కలె క్టర్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కన్నెపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన ఆర్‌వోఆర్ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ మోతిలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టంలోని ప్రతి అంశాన్ని, హక్కును ప్రతి రైతు పూర్తిగా తెలుసుకోవాలన్నారు. ఈ చట్టంలో హక్కులు, రికా ర్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారని, రిజిస్ర్టేష న్, మ్యుటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్ధాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేస్తామన్నారు. సాదాబైనామా దరఖాస్తులకు కూడా పరిష్కారం ఉంటుంద న్నారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండ లాల్లో సదస్సులు నిర్వహించి రైతులకు, ప్రజలకు అవగా హన కల్పిస్తామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దరఖాస్తులు స్వీకరించి సర్వే ప్రక్రియలో సంబంధిత సర్వే యర్లు, ఇతర అధికారుల నియామకంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామస్ధాయిలోని సమస్యలపై పూర్తిస్ధాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపటామని, రైతులకు పట్టా భూమి,లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలను ప్ర భుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ న్నా రు. టైటిల్, పొసెషన్ సంబంధిత సమస్యలు, కోర్టులో కొన సాగుతున్న కేసులను మినహాయించి మిగిలిన వాటిని పరి ష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఏవో సాయి ప్రశాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరపు నర్సింగరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పప్పుల రామాంజనేయులు, ఎస్‌ఐ గంగారాం, అధికారులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.