రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:48 PM
రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్య మైన ధాన్యం తీసుక వచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా గ్రామీణా భివృద్ధి శాఖ అధికారి (డీఆర్‌డీఏ) కిషన్ సూచించారు.
దండేపల్లి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్య మైన ధాన్యం తీసుక వచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా గ్రామీణా భివృద్ధి శాఖ అధికారి (డీఆర్‌డీఏ) కిషన్ సూచించారు. దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ధాన్యం కుప్పలను పరిశీలించారు. లక్ష్మికాం తపూ ర్‌లో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దాసరి ప్రేమ్‌చందుతో కలిసి కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇ బ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులు దళారులను ఆశ్రయించొద్దన్నా రు. దండేపల్లిలో మొక్కజొన్న కేంద్రాన్ని పరిశీలించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఐకేపీ ఏపిఎం భూపతి బ్రహ్మయ్య, సీసీలు తిరుపతిగౌడ్, సురేందర్, వివోఏలు, గ్రామైఖ్య సంఘాల లీడర్లు, సభ్యులు పాల్గొన్నారు.