Share News

హస్త కళలను ప్రోత్సహించాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:35 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శిం చుకునేందుకు క్షేత్రానికి వచ్చే భక్తులు హస్త కళలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసి తగిన ప్రోత్సాహం అందించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్ర టరీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ పిలుపునిచ్చా రు.

హస్త కళలను ప్రోత్సహించాలి
జ్యోతిప్రజ్వలన చేస్తున్న దేవాదాయ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజారామయ్యర్‌

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజారామయ్యర్‌

యాదగిరిగుట్ట, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శిం చుకునేందుకు క్షేత్రానికి వచ్చే భక్తులు హస్త కళలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసి తగిన ప్రోత్సాహం అందించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్ర టరీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ పిలుపునిచ్చా రు. తెలంగాణ హస్త కళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గోల్కొండ హస్త కళల విక్రయశాలను జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ నాయుడు సత్యనారాయణ, ఆలయ ఈవో ఏ.భాస్కర్‌రావుతో కలిసి బుధ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హస్త కళలకు సంబంధించిన వస్తువులు కొండపైన గోల్కొండ హస్తకళల విక్రయశాలలో లభిస్తాయన్నారు. హస్తకళలను ప్రోత్సహించేందుకు ఇక్కడ విక్రయశాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హస్తకళల అభివృద్ధి సంస్థ ఓఎస్డీ బాషా, మసూద్‌ అలీ, వేణుగోపాల్‌, గాయత్రి, సుల్తానా, శ్రీపాణి, మహేందర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:35 AM