Share News

నేతన్నకు.. రుణ విముక్తి!

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:52 PM

చేనేత కార్మికులకు రేవంత్‌ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

నేతన్నకు.. రుణ విముక్తి!

చేనేత రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయం

రూ.లక్ష లోపు మాఫీ చేస్తూ ఉత్తర్వులు

జిల్లాలో రూ.3.48కోట్లు మాఫీ

817 మందికి చేనేత కార్మికులకు లబ్ధి

ఇప్పటికే రుణం చెల్లించిన వారికీ వర్తింపు

సర్కారు జీవోతో ఆనందం

జనగామ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు రేవంత్‌ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత రుణాలకు సంబంధించి గతంలోనే సీఎం హామీ ఇవ్వగా తాజాగా రుణమాఫీకి సంబంధించి రూ.33కోట్లను విడుదల చేస్తూ ఇటీవల జీవో తీసుకొచ్చింది. దాంతో చేనేత కార్మికుల ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. జిల్లాలో 817మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుండగా, రూ.3.48 కోట్ల మేర రుణాలు మాఫీ కానుంది. ఈనెల 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నేతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది.

రూ.లక్ష లోపు రుణ మాఫీ..

చేనేత రుణమాఫీలో భాగంగా రూ.లక్ష రుణాల ను ప్రభుత్వం మాఫీ చేయనుంది. కార్మికులు వ్యక్తిగ తంగా, సొసైటీల ద్వారా రుణాలు పొందగా కేవలం వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలను మాత్రమే ప్రభు త్వం మాఫీ చేయనుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో 2017మార్చి లోపు ఉన్న రుణాలు మాఫీ కాగా.. ప్రస్తుతం 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసు కున్న రుణా లను మాఫీ కానున్నాయి. కార్మికుడికి వ్యక్తిగతంగా ఎంత రుణం ఉన్నా రూ.లక్ష వరకు మాఫీ కానుంది. మాఫీ కసరత్తును ప్రభుత్వం మూడు నెలల క్రితమే ప్రారంభించింది. గత ఏడాది సెప్టెంబరు 9న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభిం చారు. గత డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి చేనేత రుణాలకు సంబంధించిన వివరా లను తెప్పించుకున్నారు. జిల్లాల వారీగా చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు ఎంత? లబ్ధికి ఎంత మంది అర్హులన్న వివరాలను ఉన్నతా ధికారులు సేకరించారు. తక్కువ మొత్తంలోనే రుణాలు ఉండడంతో మాఫీ అమలుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రూ.3.48 కోట్లు మాఫీ..

జిల్లావ్యాప్తంగా 817 మందికి రుణమా ఫీ కానుంది. జిల్లాలో 817 మంది చేనేత కార్మికులు వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్నారు. వీరిలో రూ.లక్ష లోపు ఉన్నవారు, రూ.లక్ష పైబడి ఉన్నవారు ఉన్నారు. లక్ష వరకే మాఫీ చేస్తుండడం తో 817 మందికి లబ్ధి చేకూరనుంది. ఆ పైబడి ఉన్న రుణాన్ని వారు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తం గా 12 మండలాల పరిధిలో సుమారు 3వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. జనగామతోపాటు బచ్చ న్నపేట, కొడకండ్ల మండలాల్లో చేనేత కార్మికులు అధికంగా ఉంటారు. చేనేత వృత్తి నమ్ముకొని జిల్లాలో వేల కుటుం బాలు జీవనం సాగిస్తున్నాయి.

రుణమాఫీపై హర్షం

చేనేత రుణమాఫీ నిర్ణయంపై చేనేత కార్మికుల్లో హర్షం వ్యక్త మవుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2010 నుంచి 2017 మా ర్చి వరకు తీసుకున్న చేనే త రుణాలను మాఫీ చేసింది. ఎన్నికల ప్రచారం లో భాగంగా అధికారంలోకి రాగానే చేనేత రుణాలను మాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి అప్పట్లో హామీ ఇచ్చారు. దాంతో 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024మార్చి 31 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాం తో ఏళ్ల నుంచి ఎదురుచూపులకు తెరపడినట్టయిం ది. 2017 ఏప్రిల్‌ 1 తర్వాత రుణాలు తీసుకున్న వారిలో కొంతమంది తిరిగి చెల్లించారు. దీనితో తమకు రుణమాఫీ వర్తిస్తుందో లేదోనని, అనవసరం గా చెల్లించామన్న భావనలో ఉండిపోయారు. దీంతో ప్రభుత్వం తిరిగి చెల్లించిన వారికి సైతం రుణమాఫీ వర్తింపచేస్తామని ప్రకటించడం విశేషం.

రూ.3.48కోట్ల రుణాలు మాఫీ

-పి.చౌడేశ్వరి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, చేనేత, జౌళీ శాఖ, జనగామ.

చేనేత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. జిల్లాలో 817 మందికి సంబంధించి రూ.లక్ష వరకు రుణాలు మాఫీ అవుతాయి. రుణమాఫీ కింద రూ.3.48 కోట్ల మేర సర్కారు నిధులు విడుదల చేయనుంది.

Updated Date - Mar 17 , 2025 | 11:52 PM