Home » Warangal
ప్రస్తుత కాలంలో మార్కుల ప్రాముఖ్యత పెరిగినందున, విద్యార్థుల మనసులో అనేక ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో విద్యార్థి ఇదే అశంపై తీవ్ర మనస్తాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
వరంగల్లోని అతిపెద్ద టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తులు తయారు చేస్తున్న కిటెక్స్ కంపెనీ 25 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. మంగళవారం నుంచే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుంది.
BRS Warangal Meeting: బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ హై కమాండ్ ప్లాన్ చేసింది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ వరుసగా నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సభ కోసం వరంగల్ పోలీసుల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.
2021 నుంచి తాజా ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ’ విజయం దాకా టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న ‘భారత జట్టు ఫీల్డింగ్ కోచ్’ దిలీప్ విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.....
Bomb Scare: వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
మావోయిస్టు నేత రేణుక అలియాస్ భాను, సుధీర్లది బూటకపు ఎన్కౌంటర్ అని పోలీసులే ఇంట్లో నుంచి తీసుకెళ్లి హత్య చేశారంటూ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఓ లేఖలో పేర్కొంది. వారు అనారోగ్యం కారణంగా బీజాపూర్ జిల్లా బెల్నార్లోని ఓ ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకుని పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేశాయన్నారు.
మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతు అలియాస్ భాను అంత్యక్రియలు సొంతూరు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండిలో ముగిశాయి.
వరంగల్ చపాట రకం మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ సర్టిఫికెట్ జారీ అయింది. దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలోని తిమ్మంపేట చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేర కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి ఈ సర్టిఫికెట్ను అందించారు.
వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి నెలకొంది. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఈద్గా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా ప్రార్థనల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లోనూ మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిక్కిరిసిపోయాయి.
ఇద్దరు వ్యక్తుల పేర్లు, వాళ్ల తండ్రి పేర్లు ఒకేలా ఉండటాన్ని కొంత మంది అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు చనిపోగా.. ఆ వ్యక్తికి వచ్చే ప్రభుత్వ పెన్షన్ను.. బతికున్న వ్యక్తితో డ్రా చేయించారు.