ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచండి
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:33 PM
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల నమ్మకా న్ని పెంచి, విద్యార్థుల నమోదు శాతాన్ని పెం చాలని డీఈవో రమేష్ కుమార్ ఉపాధ్యాయు లను కోరారు.
- జిల్లా విద్యాశాఖాధికారి రమేష్
నాగర్‌కర్నూల్‌టౌన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల నమ్మకా న్ని పెంచి, విద్యార్థుల నమోదు శాతాన్ని పెం చాలని డీఈవో రమేష్ కుమార్ ఉపాధ్యాయు లను కోరారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కా ర్యాలయంలో గుడిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రవేశాలకు ప్రచార పోస్టర్‌ను డీఈవో విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు లకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం, నాణ్యమైన విద్య, డిజిటల్ క్లాస్‌రూంలు, ప్యూరి ఫైడ్ తాగునీరు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వంటి సదుపాయాలను వివరిస్తూ ప్రధానోపాధ్యాయుడు కురుమయ్య నేతృత్వంలో ప్రచార పోస్టర్‌ను రూ పొందించారు. కార్యక్రమంలో జడ్పీ హెచ్‌ఎస్ గుడిపల్లి ప్రధానోపాధ్యా యుడు, నోడల్ అధికారి కురుమ య్య, ఏసీ రాజశేఖర్‌రావు, ఎస్‌జీఎఫ్ పాండు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.