Share News

Uppal Stadium Prohibited items: ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులకు అనుమతి లేదు! రూల్స్ అతిక్రమిస్తే చిక్కులే

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:57 PM

నేటి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వెళుతున్న క్రికెట్ అభిమానులకు అలర్ట్. స్టేడియంలోకి అనుమతించని 12 వస్తువుల జాబితాను రాచకొండ పోలీసులు విడుదల చేశారు. నిబంధనలు పాటించకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరించారు.

Uppal Stadium Prohibited items: ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులకు అనుమతి లేదు! రూల్స్ అతిక్రమిస్తే చిక్కులే

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్ పీక్స్‌లో ఉంది. మరికొద్ది గంటల్లో జరగనున్న హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో జెయింట్స్ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టిక్కెట్లు ఉన్న వారు స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, మ్యాచ్‌ సంబరంలో పడి చిన్న పొరపాట్లతో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హైదరాబాద్‌ పోలీసులు మరోసారి హెచ్చరించారు. స్టేడియంలో తీసుకెళ్లకూడని వస్తువులున్న జాబితాను విడుదల చేశారు. మొత్తం 12 వస్తువులతో కూడిన జాబితాను రాచకొండ పోలీసులు విడుదల చేశారు.

వాటర్ బాటిల్స్, మద్యం, ఇతర పానీయాలు, పెంపుడు జంతువులు, టపాసులు, హెల్మెట్స్, బైనాక్యులర్స్, లాప్‌టాప్‌లు సెల్ఫీ స్టిక్స్, సిగరెట్స్, లైటర్లు, అగ్గిపెట్టెలు, తుపాకులు, కత్తులు, ఇతర ఆయుధాలుతో వీపునకు తగిలించుకునే బ్యాక్ పాక్స్, హ్యాండ్స్, మాదరద్రవ్యాలు వంటివాటిని స్టేడియంలోకి అనుమతించబోమని రాజకొండ పోలీసులు తెలిపారు.


Also Read: హైదరాబాద్ వర్సెస్ లక్నో.. ఉప్పల్ ఫైట్‌లో గెలిచేదెవరంటే..

లగేజీని పెట్టుకునేందుకు స్టేడియంలో క్లోక్ రూమ్‌ లేదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. కాబట్టి, నిషేధిత వస్తువులు వెంట తెచ్చుకునే వారు చిక్కుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 8 మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. వీటిల్లో ఒకటి ఆదివారం జరిగింది. మిగతా ఆరు మ్యాచులు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు.


Also Read: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

ఇదిలా ఉంటే, నేడు జరిగే మ్యాచ్‌లో పరుగుల వరద తప్పదన్న అంచనాల నడుమ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కమిన్స్ సేన ఈసారి 300 మార్కు క్రాస్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లలో కూడా ఈ జోష్ కనిపిస్తోంది. ఇక ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమన్న విషయం తెలిసిందే. ఇటీవలి ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్‌లో రెండు టీమ్స్ కలిపి 500 పైచిలుకు స్కోరు చేశాయి. దీంతో, మరోసారి పరుగుల సునామీ అభిమానులను ముంచెత్తనుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read Latest and Telangana News

Updated Date - Mar 27 , 2025 | 05:56 PM