Kavitha: రాష్ట్రం పరువు తీస్తున్న సీఎం: ఎమ్మెల్సీ కవిత
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:52 AM
వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని, కాంగ్రెస్ మార్కు అవినీతికి నిదర్శనంగా ఉందని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. రాష్ట్రానికి చోదకశక్తిగా పని చేయాల్సిన సీఎం.. రాష్ట్రం దివాలా తీసిందని ప్రకటించడం దురదృష్టకరమన్నారు.

వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని, కాంగ్రెస్ మార్కు అవినీతికి నిదర్శనంగా ఉందని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. రాష్ట్రానికి చోదకశక్తిగా పని చేయాల్సిన సీఎం.. రాష్ట్రం దివాలా తీసిందని ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఇలా చేస్తే దేశంలో రాష్ట్రం పరువు పోతుందని వ్యాఖ్యానించారు. పదేపదే అబద్ధాలు చెబుతున్న సీఎంకు గిన్నిస్ రికార్డు వచ్చినా ఆశ్చర్యం లేదని అన్నారు. శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ కేసీఆర్‌పై నిందలు మోపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సీఎం, మంత్రులు అబద్ధాలు చెప్పడం మానకపోతే ఈ నెల 27న సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ సభకు చుట్టపుచూపులా వచ్చి వెళ్తున్నారని, పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.