Share News

Telangana: ఒక్కరికే దిక్కు లేదంటే.. ఒకే వేదికపై ఇద్దర్ని పెళ్లాడిన వ్యక్తి

ABN , Publish Date - Mar 29 , 2025 | 07:26 AM

ఆస్తి, మంచి జాబ్ అన్నీ ఉన్నా సరే.. పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకడం లేదు. అలాంటి పెళ్లి కాని ప్రసాదులు కుళ్లుకుని చచ్చిపోయే వార్త ఇది. ఒకేసారి ఇద్దరిని ప్రేమించడమే కాక ఒకే వేదిక మీద వేల మంది సమక్షంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు ఓ వ్యక్తి.

Telangana: ఒక్కరికే దిక్కు లేదంటే.. ఒకే వేదికపై ఇద్దర్ని పెళ్లాడిన వ్యక్తి
Marriage

ఆసిఫాబాద్: ఒకప్పుడంటే బాల్య వివాహాలు జరిగేవి. అయితే మారుతున్న కాలంతో పాటు.. వివాహం విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పెళ్లి విషయంలో నేటి యువత ఆలోచన తీరు మారుతోంది. ముందు జీవితంలో సెటిల్ అవ్వాలి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని భావిస్తున్నారు. యువతులైతే.. అన్ని విధాలుగా లైఫ్‌లో సెటిల్ అయిన అబ్బాయి కోసం చూస్తున్నారు. గతంలో మాదిరి వయసు తేడా ఎక్కువగా ఉంటే పెళ్లికి అంగీకరించడం లేదు. దాంతో సమాజంలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. అమ్మాయిలు దొరకడమే గగనం అయ్యింది. ఎవరో ఒకరు.. పెళ్లి అయితే చాలు అన్నట్లుగా ఉంటున్నారు. ఇక్కడ ఒక్క పిల్ల దొరకడమే మహా భాగ్యంగా ఉంటే ఓ యువకుడు మాత్రం ఏకంగా ఒకేసమయంలో ఇద్దరిని ప్రేమించాడు.. అంతటితో ఆగక.. ఒకే మండపంలో.. ఇద్దరిని తన భార్యలుగా చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ, అసిఫాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఆ వివరాలు..


ఒకే పెళ్లి మండపంలో.. ఒకేసారి ఇద్దరు యువతుల మెడలో తాళి కట్టి వార్తల్లోకెక్కాడు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం గుమ్నూర్‌కు చెందిన సూర్యదేవ్ అనే యువకుడు. అంతేకాదు.. పెళ్లి శుభలేఖలోనే.. తాను ఇద్దరు యువతులను ఒకే సారి వివాహం చేసుకుబోతన్నట్లు ప్రకటించాడు. ఈ పెళ్లి చూడటం కోసం జనాలు భారీగా తరలి వచ్చారు. అలా వేయి మంది బంధుమిత్రుల సమక్షంలో.. వేదమంత్రాల సాక్షిగా.. ఇద్దరు యువతుల మెడలో మూడు ముళ్లు వేసి.. ముచ్చటగా ముగ్గురు అన్నట్లుగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ అరుదైన పెళ్లి వార్త కాస్త సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది.


మరి ఒకే సారి ఇద్దరిని పెళ్లిడిన సూర్యదేవ్ బాగా డబ్బున్న వ్యక్తా అంటే.. ఓ సాధారణ రైతు. మరి అతడు వివాహం చేసుకుంది అక్కాచెల్లెళ్లానా అంటే అది కూడా కాదు. పైగా ఆ ఇద్దరు యువతులు వేర్వేరు గ్రామాలకు చెందిన వారు. మూడేళ్ల కిందట ఈ ముగ్గురు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించిన సూర్యదేవ్.. ఈ విషయాన్ని ముందగానే వారికి చెప్పాడు. అంతేకాక తనకు ఇద్దరు ముఖ్యమే అని.. అందుకే ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఆ యువుతులు కూడా సూర్యదేవ్‌ను వదులుకోవడం ఇష్టం లేక పెళ్లికి అంగీకరించారు.


ఇద్దరు యువతులు పెళ్లికి అంగీకరించడంతో.. ఒకే పెళ్లి మండపంలో ఒకే ముహుర్తానికి వేయి మంది అతిథుల సమక్షంలో ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుని.. ఇద్దరు భార్యల ముద్దుల భర్తగా వార్తల్లోకెక్కాడు. పైగా ఈ ఇద్దరికీ భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని బాండ్ కూడా రాసిచ్చాడు. ఇద్దరు‌ అమ్మాయిల తల్లిదండ్రులు బాండ్‌ను అంగీకరించడంతో.. వారు ముచ్చటగా ముగ్గరయ్యారు. ఈ పెళ్లి వార్త తెలిసిన పెళ్లి కానీ ప్రసాదులు.. ఏం లక్కు రా నాయనా.. మాకు ఒక్కరే దిక్కు లేదంటే.. నువ్వు ఏకంగా ఇద్దరిని.. అది కూడా ఒకే వేదిక మీద పెళ్లి చేసుకున్నావు.. తోపహే నువ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఉన్నదంతా అమ్మేసి.. 42 అడుగుల పడవపైన.. ఇదో వింత కథ..

బ్రష్‌తో బైక్‌నే నడిపించాడుగా.. ఇతడి టెక్నిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..

Updated Date - Mar 29 , 2025 | 11:34 AM