Share News

సాగర్‌ను సందర్శించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:26 AM

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ను గురువారం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ అతుల్‌ జైన్‌ సతీసమేతంగా సందర్శించారు.

సాగర్‌ను సందర్శించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌
బుద్ధుడి పాదాల వద్ద అంజలిఘటిస్తున్న కేఆర్‌ఎంబీ చైర్మన్‌ అతుల్‌ జైన్‌

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ను గురువారం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ అతుల్‌ జైన్‌ సతీసమేతంగా సందర్శించారు. ఉదయం విజయవిహార్‌ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు నీటిపారుదల శాఖ అధికారులు స్వాగతం పలికారు. అనతంరం హిల్‌కాలనీలోని బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈవో శాసన, ఎస్టేట్‌ మేనేజర్‌ రవిచంద్రలు బుద్ధవనం విశేషాలను వివరించారు. పర్యాటకశాఖ లాంచీలో జలాశయంలోని నాగార్జునకొండకు చేరుకుని మ్యూజియం, సింహాళీయం, బౌద్ధమత స్తూపాలను, నమూనాలను తిలకించారు. ఆ తర్వాత సాగర్‌ ప్రధాన డ్యాం, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రాన్ని తిలకించారు. వారి వెంట సాగర్‌ ప్రాజెక్టు ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లిఖార్జున్‌రావు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:26 AM