KTR: విధ్వంసమే మీ ఎజెండానా
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:03 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. పేద ప్రజల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొట్టడం, గిరిజన గూడెలపై ఆक्रमణం, మరియు హెచ్‌సీయూ భూములపై అభివృద్ధి పేరిట విధ్వంసం సృష్టించడం ఎలానని ప్రశ్నించారు. ప్రభుత్వం భూములపై రియల్ ఎస్టేట్ క్రీడలు సాగిస్తోందని, ప్రజాపాలన కాదని ప్రజలను హింసించే పాలన చేస్తున్నారని ఆరోపించారు.

‘‘పర్యావరణ పరిరక్షణంటూ పేదప్రజల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొట్టించావ్. ఎండిన భూముల అభివృద్ధి పేరిట గిరిజన గూడేలపై పడ్డావ్. ఇప్పుడు నోరులేని జీవాలపైకి బుల్డోజర్లను వదులుతున్నావు. రేవంత్‌రెడ్డీ.. నువ్వు నడుపుతున్నది ప్రభుత్వాన్నా? బుల్డోజర్ కంపెనీనా? విధ్వంసమే నీ ఎజెండానా? నువ్వు ప్రజాప్రతినిధివా? రియల్‌ఎస్టేట్ ఏజెంట్‌వా?’’ అంటూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎంపై మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజలను హింసించే పాలన అని విమర్శించారు. చదువు చెప్పేచోట విధ్వంసం సృష్టిస్తూ.. విలువైన భూములపై వికృత క్రీడ సాగిస్తున్నారని ఆరోపించారు. ‘‘హెచ్‌సీయూ భూముల వెనక నువ్వు దాస్తున్న నిజమేంటి? సెలవు రోజుల్లో.. అర్ధరాత్రి నీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి? కోర్టులంటే నీకంత భయమెందుకో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News