కొత్త చట్టంతో భూ సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:16 PM
ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతా యని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ పట్టణం సీతా రాంపల్లి రైతు వేదిక వద్ద సోమవారం సాయంత్రం భూ భారతి కొత్త ఆర్‌ఓఆర్ చట్టం 2025 అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైనా కలెక్టర్ మాట్లాడా రు.
సీతారాంపల్లి సదస్సులో కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతా యని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ పట్టణం సీతా రాంపల్లి రైతు వేదిక వద్ద సోమవారం సాయంత్రం భూ భారతి కొత్త ఆర్‌ఓఆర్ చట్టం 2025 అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైనా కలెక్టర్ మాట్లాడా రు. చట్టంలో హక్కులు, రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రిజిస్ర్టేసన్, మూటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేయనున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనా మ ధరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 30వ తేది వర కు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తా మన్నారు. జూన్ 2వ తేది వరకు సమస్యలను పరిష్కరించడం, మిగిలిన మండలాల్లో ఆగస్టు 15వ తేది లోగా పరిష్కరించే విధం గా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ స్థాయిలోని సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పరిష్కరించే దిశగా చర్యలు తీసు కుంటామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టంలో పొందుపర్చిన అంశాలను రైతు ప్రయోజనం దిశగా పూర్తిస్థాయిలో అమలు చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటమన్నాని కలెక్టర్ అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ సబా వత్ మోతిలాల్, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ రావులు కొత్త చట్టంలో పొందుపర్చిన వివరాల గురించి రైతులకు వివరిం చారు. ఈ సదస్సులో తహసిల్దార్ శ్రీనివాస్, డిప్యూటి తహసిల్దార్ హరిత, ఆర్‌ఐ చందర్, వ్యవసాయ శాఖ ఏడి అనిత, నాయకులు సుర్మిళ్ల వేణు, దర్ని మధుకర్, సింగల్ విండో డైరెక్టర్లు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.