Share News

Mahesh Babu-Gautam Ghattamaneni: గౌతమ్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా.. తండ్రికి తగ్గ తనయుడే

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:32 AM

Tollywood: సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ అదరగొట్టేశాడు. సూపర్బ్ యాక్టింగ్‌తో ఫ్యాన్స్ హృదయాలు కొల్లగొట్టేశాడు. అతడి నటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Mahesh Babu-Gautam Ghattamaneni: గౌతమ్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా.. తండ్రికి తగ్గ తనయుడే
Gautam Ghattamaneni

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ డెబ్యూ గురించి అభిమానులు ఆతృ‌తగా ఎదురు చూస్తున్నారు. తాత కృష్ణ, తండ్రి మహేశ్ బాటలో అతడు నడవాలని.. వెండితెరను ఏలాలని కోరుకుంటున్నారు. అతడ్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే గౌతమ్ కూడా యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటూ.. భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో ట్రెయిన్ అవుతున్న గౌతమ్.. రీసెంట్‌గా తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ను బయటపెడుతూ ఓ స్కిట్‌లో పార్టిసిపేట్ చేశాడు. తోటి స్టూడెంట్‌తో కలసి మహేశ్ కుమారుడు చేసిన ఈ స్కిట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


ఇరగదీశాడు

స్కిట్ స్టార్టింగ్‌లో నవ్వుతూ ప్రశాంతంగా కనిపించిన గౌతమ్.. ఆ తర్వాత కొద్ది సేపటికే సీరియస్ అవ్వడాన్ని చూడొచ్చు. ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనైన గౌతమ్.. అదే టెంపోలో సీరియస్‌గా డైలాగులు చెబుతూ ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. దీన్ని చూసిన నెటిజన్స్ గౌతమ్ మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మహేశ్ తనయుడు ఇరగదీశాడని అంటున్నారు. యాక్టింగ్ అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. కాగా, ఇప్పటికే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన గౌతమ్.. తండ్రి బాటలోనే యాక్టర్‌గా రాణించాలని అనుకుంటున్నాడు. అందులో భాగంగానే యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. కొన్నాళ్ల కింద స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఇకపోతే, సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే మూవీలో బాలనటుడిగా కనిపించి అలరించాడు గౌతమ్.


ఇవీ చదవండి:

మొదటి రోజే IPL ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

బ్యాటర్లకు గట్టిగా బిగిస్తున్న బీసీసీఐ

అంపైర్లకు ఫ్రాంచైజీల దండం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 12:55 PM