Share News

మేడేను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:23 AM

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.

మేడేను విజయవంతం చేయాలి
సమవేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి

మిర్యాలగూడ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలో జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి జనరల్‌బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారీ దేశాలు విదేశీ మార్కెట్ల కోసం తమలో తామే కలహించుకుంటూ తీవ్రమైన సంక్షోభంలో కూరుకపోతున్నాయన్నారు. ప్రపంచ జనాభాలో 25 శాతం మంది ప్రజలు ఎరజెండా నీడన సంఘటితమౌతున్నారని అన్నారు. నరేంద్రమోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది మరిచి కొత్త సమస్యలను ప్రజలపై రుద్దుతున్నారన్నారు. వక్ఫ్‌ చట్టం, డీలిమిటేషన్‌, జమిలి ఎన్నికల లాంటివి తెరపైకి తెచ్చి ప్రజల్లో ఐక్యతను దెబ్బతీసేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం భారత ప్రజలకు ప్రసాదించిన ప్రాధమిక హక్కులకు సైతం విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. 500 రోజులు పాలన పూర్తిచేసుకున్న కాంగ్రేస్‌ ప్రభుత్వం 100 రోజుల్లో 6 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని నేటి వరకు అందులో సగం కూడా అమలు అమలు చేయలేదన్నారు.. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగధీశ్‌చంద్ర, గాదె పద్మ, మూడావత్‌ రవినాయక్‌, మల్లుగౌతంరెడ్డి, భవాండ్ల పాండు, శశిదర్‌రెడ్డి, వినోద్‌నాయక్‌, రొండి శ్రీనివాస్‌, రెమిడాల పరుశరాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, ఆయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:23 AM