తిరునాళ్లకు ముస్తాబు
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:06 AM
దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మఠంపల్లి శుభవార్త దేవాలయం 28 వసంతాలు పూర్తి చేసుకుం ది.
తిరునాళ్లకు ముస్తాబు
పెద్ద పండుగకు సిద్ధమైన శుభవార్త దేవాలయం
మూడు రోజుల పాటు వార్షిక వేడుకలు
హాజరుకానున్న పలువురు ప్రముఖ రాజకీయ నేతలు, పీఠాధిపతులు
మఠంపల్లి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మఠంపల్లి శుభవార్త దేవాలయం 28 వసంతాలు పూర్తి చేసుకుం ది. ఈ నేపథ్యంలో వార్షిక మహోత్సవాలు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే ఈ వేడుకలకు శుభవార్త దేవాలయాన్ని ఆకర్షణీయమైన రంగులతో విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. కృష్ణానది తీరాన వెలసిన శుభవార్త దేవాలయంలో మరియమాత భక్తులను కోర్కెలు తీరుస్తూ అలరారుతుంది. మరియమాత సన్నిధిలో ఎందరెందరో భక్తులు కులాలు, మతాలకతీతంగా సేద తీరుతూ, ప్రార్థిస్తూ ఆ తల్లి దీవెనలు పొందుతున్నారు. ‘‘ఈ లోకానికి రక్షుకుడిని అందించిన తల్లి మన బాధలను, వ్యాధులను, ఇతర సమస్యలను తన కుమారుని ప్రార్ధించి మన అవసరాలు తీర్చే తల్లి మరియతల్లి. ఆ తల్లి దీవెనలు పొందుటకు మిమ్ములను మృదయ పూర్వకముగా ఆహ్వానిస్తున్నామని సందేశం.’’
ఈ శుభవార్త దేవాలయం (మంగళవార్త చర్చి) 1968వ సంవత్సరంలో నిర్మించారు. పురాతన చర్చిని ఆధునిక హంగులతో నిర్మించేందుకు 1980 సంవత్సరం లో శంకుస్థాపన చేసి 1993వ సంవత్సరంలో పూర్తిచేశా రు. అప్పటి వరకు మంగళవార్త చర్చిగా పిలవబడుతు న్న దేవాలయాన్ని శుభవార్త దేవాలయంగా నామకర ణం చేశారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 24, 25, 26 తేదీ ల్లో నిర్వహించుకునే ఈ మహోత్సవాన్ని గ్రామస్థులంద రూ పెద్ద పండుగగా జరుపుకుంటారు. కుల, మతాలకతీతంగా గ్రామస్థులందరూ ఈ పెద్ద పండుగను ఘనం గా నిర్వహిస్తుంటారు. గ్రామంలోని క్రైస్తవ కుటుంబాలకు చెందిన ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల్లో ఉన్న బంధుమిత్రులందరు ఈ పెద్ద పండుగకు వస్తుంటారు.
16 నుంచి 26 వరకు ఉత్సవాలు
శుభవార్త చర్చి మహోత్సవాలు ఈ నెల 16 నుం చి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విచారణ గురువు మార్టిన్ పసల సోమవారం తెలిపారు. దేవాలయ వార్షిక వేడుకల సందర్భంగా ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు నవదిన జపములు, దివ్యబలిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 25వ తేదీన ఉదయం 9 గంటలకు శుభవార్త పండుగ సమిష్టి దివ్యబలిపూజను నల్లగొండ, ,గుంటూరు, ఖమ్మం పీఠాధిపతులు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి ఒత్తుల సమర్పణ ప్రత్యేక పూజలు, సా యంత్రం 5గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన రంధంపై (తేరు) మరియమాత విగ్రహాన్ని వుంచి గ్రామ పురవీధులలో బాణసంచాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. 26 తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు క్రైస్తవ కుటుంబాలలో మరణించి వారి కోసం దివ్యబలిపూజ (పెద్దల పూజ) నిర్వహించనున్నట్లు విచారణ గురువు పసల మార్టిన్ తెలిపారు. ఈవేడుకల సందర్భంగా శుభోదయ యువజన సం ఘం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 29వతేదీ వర కు రెండుతెలుగు రాష్టాల స్థాయి ఎడ్ల పందేల బల ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేసినట్లు యువజన సంఘం సభ్యుడు గాదె జయభరతరెడ్డి తెలిపారు.