Share News

Youtuber Harsha Sai: హర్ష సాయికి ఊహించని షాక్.. జైలు శిక్ష తప్పదా..

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:50 PM

యూట్యూబర్ హర్ష సాయికి ఊహించని షాక్ తగిలింది. గత కొంత కాలంగా యూట్యూబ్‌కు దూరంగా ఉన్న ఆయనకు జైలు శిక్ష తప్పేలా లేదు. గతంలో ఆయన చేసిన ఓ తప్పు.. ఇప్పుడు వెంటాడుతోంది..

Youtuber Harsha Sai: హర్ష సాయికి ఊహించని షాక్.. జైలు శిక్ష తప్పదా..
Youtuber Harsha Sai

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు జైలు శిక్ష తప్పేలా లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న, చేసిన వారికి చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కన్ను హర్ష సాయి మీద పడింది. నిన్న ట్విటర్ వేదికగా హర్ష సాయిపై ఫైర్ అయ్యారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్ష సాయి మాట్లాడిన మాటల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘ చేస్తున్న‌దే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు! ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు’ అంటూ మండిపడ్డారు.


హర్ష సాయిపై కేసు నమోదు

హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సజ్జనర్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ ఎండీ సూచించారు. గత కొన్ని నెలల నుంచి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై ఉక్కు పాదం మోపుతున్నారు. వారిపై కేసులు పెట్టి జైలులో పడేస్తున్నారు. ఇప్పటికే లోకాల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్‌లపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరికొంత మందితో వాటికి వ్యతిరేకంగా వీడియో చేయించారు.


ఇవి కూడా చదవండి:

Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..

PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 16 , 2025 | 12:50 PM