Share News

పోలీసుల సేవలు అభినందనీయం

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:20 PM

పోలీసులు గ్రామాల ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మాదారం పోలీసులు, మంచిర్యాల మెడి లైఫ్‌ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని నర్సాపూర్‌ గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌తో కలిసి ప్రారంభించారు.

పోలీసుల సేవలు అభినందనీయం
ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతున్న గిరిజనులు

తాండూర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు గ్రామాల ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మాదారం పోలీసులు, మంచిర్యాల మెడి లైఫ్‌ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని నర్సాపూర్‌ గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులకు ఎల్లప్పుడు తోడుగా ఉంటామని వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని, ఇందుకు పోలీసు శాఖను అభినందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు గిరిజనులు ఎమ్మెల్యే, పోలీసులకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో , మంగళహారతులతో స్వాగతం పలికారు. కాగా ఈ శిబిరంలో దాదాపు 500 మంది గిరిజనులు పాల్గొనగా వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్‌ సీఐ కుమారస్వామి, మాదారం, భీమిని ఎస్‌ఐలు సౌజన్య, విజయ్‌కుమార్‌, గ్రామ పెద్దలు పర్వతిరావు, భగవంతరావు, ప్రభాత్‌రావు, అమృతరావు, గంగుపటేల్‌ , కాంగ్రెస్‌ నాయకులు రవీందర్‌రెడ్డి, ఈసా, మహేందర్‌రావు, మురళీధర్‌రావు, రాంచందర్‌, శంకర్‌, బానయ్య, విష్ణు కళ్యాణ్‌, అంజితదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:20 PM