సిద్ధమవుతున్న సొంతగూడు
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:07 AM
రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చు రుకుగా సాగడం లేదు. అందుకు కారణం ప్రభుత్వం బిల్లులు వెం టనే ఇస్తుందో లేదోనన్న అనుమానం.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుకు తొలి విడత బిల్లు విడుదల
ఇళ్ల నిర్మాణానికి ఉత్సాహం
మోత్కూరు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చు రుకుగా సాగడం లేదు. అందుకు కారణం ప్రభుత్వం బిల్లులు వెం టనే ఇస్తుందో లేదోనన్న అనుమానం. ఆ అనుమానాలను పటాపం చలు చేస్తూ ప్రభుత్వం బేస్‌మెంటు వరకు ఇల్లు నిర్మించుకున్న ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇటీవల మొదటి విడత బిల్లు రూ.లక్ష విడు దల చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరగకపోవడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో పాటిమట్ల గ్రామానికి చెందిన ఒక్క లబ్ధిదారు ఎల్. సంధ్యకు మాత్రమే తొలి విడత బిల్లు రూ.లక్ష ఆమె బ్యాంకు అకౌంట్లో జమ అయ్యాయి. విషయం తెలిసి మిగతా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు సిద్దమవుతున్నారు.
నియోజకవర్గంలో తొమ్మిది గ్రామాల ఎంపిక
తుంగతుర్తి నియోజకవర్గంలో 9మండలాలు ఉండగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో మండలం నుంచి ఒక్కో గ్రామాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ గ్రామాలకు మంజూరైన ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అనర్హులను తొలగించి, అర్హులను గుర్తించారు. ఇళ్లు నిర్మించిన వెంటనే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందో లేదోనన్న భయంతో లబ్ధిదారుల్లో కొంత మందే ఇళ్ల నిర్మాణం ప్రా రం భించారు. ప్రారంభించిన వారిలోనూ కొందరివే బేస్‌మెంటు లెవల్‌కు వచ్చాయి. అధికారులు ఇప్పుడిప్పుడే మొదటి విడత బిల్లులు చేస్తున్నారు.
అనర్హుల పేర్లు తొలగింపు
అడ్డగూడూరు మండలం మానాయకుంటలో దరఖాస్తు చేసుకున్న వారిలో మరో 20మంది ఇళ్ల మంజూరు కోసం వేచి చూస్తున్నారని చెబుతున్నారు. కొన్ని మండలాల్లో లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉండడంతో వారిని తొలగించినట్టు తెలిసింది. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు ఎల్ సంధ్య ఇంటి నిర్మాణం లెంటల్ లెవల్ వరకు జరిగింది. దాంతో బేస్‌మెంటు వరకు బిల్లు చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఈ నెల 17న ప్రభుత్వం తొలి విడ తగా రూ.లక్ష జమ చేసింది. నియోజకవర్గంలోని ఇతర మండలా ల్లోనూ బేస్‌మెంటు పూర్తి చేసిన లబ్ధిదారులకు బిల్లు చేసి పంపినట్టు చెబుతున్నారు. వారి ఖాతాల్లోనూ త్వరలోనే తొలివిడత బిల్లు రూ.లక్ష జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే చెల్లిస్తున్నట్టు తెలిసి మిగతా లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. తుంగతుర్తి మండలం సింగారంతండా గ్రామం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైందని తుంగతుర్తి ఎంపీడీవో శేషుకుమార్ తెలిపారు. ఆ గ్రామంలో ఇంటి స్థలం ఉండి ఇళ్లులేని వారు 38 మందికి ఇళ్లు మం జూరయ్యాయని తెలిపారు. లబ్ధిదారుల్లో ఆరుగురు మాత్రమే పనులు చేపట్టి బేస్‌మెంటు వరకు నిర్మించారని, మిగతా లబ్ధిదారులకు కూడా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం దశల వారీగా బిల్లులు చెల్లిస్తుందన్నారు.
సొంత ఇంటి కల నెరవేరుతోంది
నేను చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో బేస్‌మెంట్ పూర్తయింది. మొదటి విడత బేస్‌మెంటు బిల్లు రూ.లక్ష బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లిస్తు న్నందున నేను త్వరలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేస్తాను. నా స్వంత ఇంటి కల నెరవేరుతోంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కృషితోనే మా పాటిమట్ల గ్రామం పైలెట్ ప్రాజెక్టు కింది ఎంపికైంది. మా గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని, నిర్మాణం జరిగిన వెంటనే బిల్లులు చెల్లిస్తున్నందున ఎమ్మెల్యే సామేలు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
సంధ్య, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు పాటిమట్ల గ్రామం