ప్రతీ ఇంటి నిర్మాణానికి నాణ్యమైన ఇసుక
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:27 PM
అక్రమాలు, అ వకతవకలు లేకుండా ప్రతీ ఇంటి నిర్మాణానికి నా ణ్యమైన గోదావరి ఇసుకను తక్కవ ధరకు అందిస్తా మని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఎర్రాయిపేట, కొల్లూరు ఇసుక రీచ్‌ల ను మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి ఆయన సం దర్శించారు.

నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టర్‌పై చర్యలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కోటపల్లి, మార్చి28(ఆంధ్రజ్యోతి): అక్రమాలు, అ వకతవకలు లేకుండా ప్రతీ ఇంటి నిర్మాణానికి నా ణ్యమైన గోదావరి ఇసుకను తక్కవ ధరకు అందిస్తా మని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఎర్రాయిపేట, కొల్లూరు ఇసుక రీచ్‌ల ను మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి ఆయన సం దర్శించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టరుకు పలు సూచనలు చేశారు. త్వరగా లోడ్ చేసి లారీలను పం పించాలని రోజుకు ఒక్క రీచ్ నుంచి 200 లారీల ఇసుకను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మ రో జేసీబీతో పాటు కూలీల సంఖ్యను పెంచాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. రోడ్డు మీద ఒక్కలారీ కూడ ఉండవద్దని ట్రాఫిక్ జామ్ అయితే కాంట్రా క్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తక్కువ ధరలో ప్రతి ఒక్కరికీ నాణ్య మైన ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయిం చిందన్నారు. ఈ ప్రాంతంలో రెండు క్వారీలు నడుస్తు న్నాయని ఇంకా కొన్ని క్వారీలను ప్రారంభిస్తామన్నా రు. ఇక్కడ లోడ్ చేసి తూకం వేసి పంపేందుకు కాం ట్రాక్టర్ వద్ద కొన్ని లోపాలు ఉన్నాయని ప్రతి రోజు 60 నుంచి 70 లారీలు మాత్రమే వెళ్తున్నాయని దీంతో లారీలు గంటల కొద్ది వేచి చూస్తున్నాయ న్నా రు. అనంతరం కోటపల్లి మండల కేంద్రంలోని త హసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ప లు రికార్డులు పరిశీలించారు. పాఠశాలల ప్రహరి గో డల పనులు సత్వరం పూర్తి చేయించాలని ఈజీఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ సోలా ర్ రక్షిత నీటి ట్యాంక్‌ను పరిశీలించారు. ఎస్సీ బా య్స్ హాస్టల్ పరిస్థితి మోడల్ ఉపాధ్యాయుడు సు రేందర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భవనం శిథిలం కావడం, గదులు సరిపోకపోవడం వసతులు లేకపోవడం వల్ల అడ్మిషన్లు తగ్గుతున్నాయని సదరు ఉపాధ్యాయుడు తెలుపగా స్పందిం చిన కలెక్టర్ 200 మంది విద్యార్థులకు అనువుగా ఉండే విధంగా నూ తన భవన నిర్మాణానికి ప్రతిపాద నలు చేపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో లక్ష్మయ్య, రూరల్ సీఐ సుధాకర్, ఎస్‌ఐ రాజేందర్, ఏపీవో వెంకటేశ్ పాల్గొన్నారు.
విధ్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
చెన్నూరు : ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ విద్యా ర్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలె క్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని చెల్లాయిపేట, సుందరశాలలోని ప్రాథమిక పాఠశా లలు, పొక్కూరు ఉన్నత పాఠశాల, మండల కేంద్రం లోని కస్తూర్బాగాంధి బాలికల విద్యాలయాలను శుక్ర వారం సందర్శించారు. తరగతి గదులు, పరిసర ప్రాంతాలు, భోజన శాలలు, రిజిష్టర్లను పరిశీలించా రు. మెనూ అమలు గూర్చి విధ్యార్థులను అడిగి తె లుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన మె నూ ప్రకారం పౌష్టిక ఆహారం, పరిశుభ్రమైన మంచి నీళ్లు అందించాలని సూచించారు. చెల్లాయిపేట ప్ర హరిగోడ పనులు పూర్తి చేసే విధంగా స్థానిక అధికా రులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ మల్లిఖార్జున్, ఎంపీడీవో మోహన్ ఉన్నారు.