Share News

Rajiv Yuva Vikasam: యువవికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు

ABN , Publish Date - Apr 01 , 2025 | 04:49 AM

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు పొడిగించింది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే ఈ పథకానికి భారీ స్పందన రాగా, ఆహ్వానించబడిన అర్హుల అభ్యర్థులు మరింత సమయం పొందారు.

Rajiv Yuva Vikasam: యువవికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు

పథకం ప్రగతిపై మంత్రులకు

సమాచారం ఇచ్చి సలహాలు తీసుకోండి

అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం 5లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ పథకానికి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు కోసం రేషన్‌కార్డులేని వాళ్లకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరయ్యాయి. వీటి జారీలో సాంకేతికపరమైన ఇబ్బందులతో పాటు సిబ్బంది కొరత వల్ల తహసీల్దార్‌ కార్యాలయాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక ఉగాది, రంజాన్‌ వంటి సెలవులు రావడం వల్ల కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచింది. గడువు పెంపు విషయాన్ని సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌ నుంచి చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు.


దరఖాస్తుల స్వీకరణ మొదలుకొని గ్రౌండింగ్‌ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని మండల, పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను భట్టి ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలన్నారు. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎంపికైన లబ్ధిదారులకు పరిశ్రమల శాఖ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పథకం విజయవంతం కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 04:49 AM