మూగ రోదన
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:47 PM
వేసవిలో మనుషులే కాదు.. ఇతర జీవులూ ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరి కావడం పరిపాటి. సమ యానికి తాగునీరు దొరక్కపోతే అవస్థలు పడక తప్పదు. నిత్యం జనారణ్యంలో సంచరించే జంతువులు, పక్షులకు నీటి కొరత ఉండకపోవచ్చు గానీ.. వన్యప్రాణులకు మాత్రం తిప్పలు తప్పవు. వేసవిలో నీటి వనరులు అడుగం టిపోతే అవి విలవిలలా డుతుంటాయి.

విలవిలలాడుతున్న వన్యప్రాణులు
దాహార్తి తీర్చుకోలేక అవస్థలు
నిలిచిపోయిన అటవీ జంతువుల తాగునీటి నిధులు
సాసర్ పిట్లలో జీపీ ట్రాక్టర్ల ద్వారా నింపుతున్న నీళ్లు
కృష్ణకాలనీ, మార్చి 17 (ఆంధ్రజ్యో తి): వేసవిలో మనుషులే కాదు.. ఇతర జీవులూ ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరి కావడం పరిపాటి. సమ యానికి తాగునీరు దొరక్కపోతే అవస్థలు పడక తప్పదు. నిత్యం జనారణ్యంలో సంచరించే జంతువులు, పక్షులకు నీటి కొరత ఉండకపోవచ్చు గానీ.. వన్యప్రాణులకు మాత్రం తిప్పలు తప్పవు. వేసవిలో నీటి వనరులు అడుగం టిపోతే అవి విలవిలలా డుతుంటాయి. ఈ ఏడాది కూడా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో అటవీ జీవులు నీటి కోసం అల్లాడుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో 1,69,461.28 హెక్టార్ల అటవీ విస్తీర్ణం విస్తరించి ఉంది. భూపాలపల్లి, మహదేవపూర్ రెండు ఫారెస్టు డివిజన్లు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ గా దుప్పులు, నెమళ్లు, కుందేళ్లు, కొండె గొర్రెలు ఇతరత్రా జంతువులు పెరుగుతున్నాయి. వీటి దాహా ర్తి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చేవి. ఈ నిధులు గత రెండేళ్ల నుంచి నిలిపి వేశారు. దీంతో వేసవిలో వన్య ప్రాణులు తాగునీ టికి ఇక్కట్లు పడుతు న్నాయి. రోడ్ల మీదకు, జనసంచారం ప్రదేశాలకు వస్తూ ప్రమాదాలకు గురవు తున్నాయి. వీటితో పాటు రెండు డివిజన్లలో కేవలం రెండే సోలార్ బోర్లు ఉండగా వాటితోనే ఫారెస్ట అధికారులు వెల్లదీస్తున్నారు. మరో నాలుగు సోలార్ బోర్లకు ప్రభుత్వానికి అటవీ అధికారులు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది.
నిధులు లేక.. నీళ్లు నింపలేక..
జిల్లా వ్యాప్తంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు 111 సాసర్ పిట్స్‌ను ఏర్పాటు చేశారు. నిధులు లేమి కారణంగా వీటిల్లో నీటిని నింపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అటవీ ప్రాంతాల సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీల ట్రాక్టర్లను నీటిని నింపేందుకు తాత్కాలికంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ఎండలు దంచి కొడుతుండగా రాబోయే ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల ట్రాక్టర్ల ద్వారా మూడు రోజులకోసారి నీటిని నింపుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్లు సమకూర్చగా సాసర్ పిట్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ఉచ్చులకు ఎక్కువ ఆస్కారం..
వేసవిలో వన్యప్రాణుల వేట పరిపాటే. ఈ కాలం లోనే వన్యప్రాణాలు దాహార్తిని తీర్చుకొనేం దుకు బయటకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులో పడుతుంటాయి. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్ల వద్ద వేటగాళ్లు అధికంగా ఉచ్చులు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భూపాలపల్లి అటవీ రేంజ్ పరిధిలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్ వద్ద వేటగాళ్లు ఉచ్చుని బిగించిన ఘట నను అటవీశాఖ అధికారులు గుర్తించి తొలగిం చారు. అలా వేటగాళ్లు అమర్చే ఉచ్చులతో అటు వన్యప్రాణులేకాకుండా పాటు అడవికి వెళ్లే పశువుల కాపర్లు, ఫారెస్టు సిబ్బంది ప్రమాదాల బారిన పడే ఆస్కారం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఉచ్చుల మూలంగా ప్రమాదాలు జరుగకముందే ఫారెస్టు, పోలీసుల శాఖ అధికారులు దృష్టి పెట్టి ఉచ్చులు బిగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
- నవీన్‌రెడ్డి, అటవీ శాఖ జిల్లా అధికారి (భూపాలపల్లి)
మూగ జీవాల సంరక్షణకు ప్రత్యేక చ ర్యలు చేపడుతున్నాం. అడవి ప్రాంతాల్లో తాగునీటిని కల్పించేందుకు సాసర్ పిట్లను ఏర్పాటు చేశాం. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా నిధులేమీ రావడం లేదు. వేటగాళ్లు ఎవరైనా ఉచ్చులు బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అటవీ ప్రాంతాల్లో అగ్గి రాజుకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలి.