Share News

టెక్నాలజీ ఉపయోగించుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలి

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:44 AM

మారుతున్న ప్రపం చానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలని తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

టెక్నాలజీ ఉపయోగించుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలి
మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ వి బాలకృష్ణారెడ్డి

గంభీరావుపేట, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మారుతున్న ప్రపం చానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలని తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేషనల్‌ సెమినార్‌లో భాగంగా జనరేటివ్‌ ఏఐపై జాతీయ సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ వి బాలకృష్ణారెడ్డి మాట్లాడారు. ఎన్‌ఈపీకి అనుగుణంగా ఐసీటీలో ఏ1 టెక్నాలజీని ఉపయోగించు కుని మారుమూల గ్రామాలలోని కళాశాలలను పట్టణ కళాశాలల ధీటుగా అభివృద్ధి చేయవచ్చన్నారు. ఎలమంచి ప్రాజెక్ట్‌ హ్యాండ్లింగ్‌ గురించి ఐడియా జనరేషన్‌ రీసెర్చ్‌ మెథడాలజీ ఏఐ ద్వారా భవిష్యత్‌కు తగిన విద్యార్థులను తయారు చేయవచ్చని అన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులు పరిశోధన నైతిక విలువలతో పాటు జ్ఞానం పెంపొందించుకోవచ్చని అన్నారు. డాక్టర్‌ కల్యాణి మాట్లాడు తూ విద్యార్థులు లిటరేచర్‌ రివ్యూ రీసెర్చ్‌ మెథడాలజీలో ఎలా చేయాలో వివరించారు. డాక్టర్‌ స్వాతి లాంగ్వేంజ్‌ ఏఐ టూల్స్‌ గురించి వివరించారు. హాంట్‌ మెట్రిక్‌ సీఈవో అయూబ్‌ షేక్‌ పిల్లల అసైన్‌మెంట్‌, అంటెండెన్స్‌, ఎక్సర్‌సైజ్‌, వాల్యూయేషన్‌ ఏఐ టూల్స్‌ ఉపయోగించి ఎలా చేయాలో వివరించారు. సెమినార్‌ అర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, వివిధ కళాశాలల పరిశోధకులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:44 AM