Share News

ఆహ్లాదం అంతంతే..

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:16 AM

ప్రజల ఆహ్లా దం కోసం సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పార్కుల్లో సమస్యలు తిష్ట వేశాయి.

 ఆహ్లాదం అంతంతే..
అర్బన పార్క్‌లో మేతకోసం వచ్చిన బర్రెలు

ఆహ్లాదం అంతంతే..

రాంనగర్‌ పార్క్‌లో పనిచేయని సీసీ కెమెరాలు

విరిగిన పరికరాలు

అర్బన పార్క్‌కు తాళం తీస్తే ఒట్టు...

రూ.3 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే

రామగిరి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆహ్లా దం కోసం సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పార్కుల్లో సమస్యలు తిష్ట వేశాయి. ఆనందం కోసం వెళ్తే ఇబ్బందులు తప్పడం లేదు. పిల్లల సరదా కోసం పట్టణంలోని రాంనగర్‌ పార్క్‌, చర్లపల్లి అర్బనపార్క్‌, రాజీవ్‌పార్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ పార్కుల్లో ప్రజలు కా సేపు సేద తీరుదామని వస్తే వారికి ఎన్నెన్నో సమస్య లు ఎదురవుతున్నాయి. రాంనగర్‌ పార్క్‌ల్లో సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయడం లేదు. పిల్లలు ఆ డుకునేందుకు ఏర్పాటు చేసిన ఆట పరికరాలు ధ్వం సమై సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇకపోతే రాజీవ్‌పార్క్‌లో సమస్యలు చెప్పనలవి లేకుండా ఉన్నాయి. పిల్లలు ఆడుకునే పరికరాలు విరిగిపోవడంతో పాటు మూత్రశాలలు ఏర్పా టు చేసినా నీటి సరఫరా లేకపోవడంతో అధ్వానంగా తయారై నిరుపయోగంగా మారాయి. దీంతో అక్కడి కి వచ్చిన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

అర్బన పార్క్‌కు తాళం తీస్తే ఒట్టు

పట్టణంలోని చర్లపల్లి ప్రాంతంలో మూడేళ్ల క్రితం నల్లగొండ పట్టణానికే తలమానికంగా ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి అధికారులు, పాలకులు సుమారు రూ.3 కోట్లతో వ్యయంతో పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు స్థలం అనువుకాదని తెలిసినా హైవే వెంట వచ్చిపోయే వారు చూడాలన్న ఉద్దేశ్యంతోనే ఇక్కడ పార్క్‌ను నిర్మించారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అయితే రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసి న పార్‌ ్క గేటుకు నేటి వరకు తాళం తీయలేదు. కనీ సం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. అధికారులు లాంఛనంగా ప్రారంభించకపోవడంతో అసాంఘిక కా ర్యకలాపాలకు అడ్డాగా మారింది. కొంతమంది తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించి మందు తాగుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పార్క్‌ పశువుల మేతకు కోసం రావడం ఆ పార్క్‌ పరిస్థితి ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన పార్క్‌ నేటి వరకు కూడా ప్రారంభానికి నోచుకోలేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

సీసీ కెమెరాల నిర్వహణకు టెండర్‌ పిలుస్తాం

రాంనగర్‌ పార్క్‌లో గతంలో సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేశాం. అయితే కెమెరాలకు సంబంధించిన తీగలను కోతులు ధ్వంసం చేయడంతో అవి పనిచేయడం లేదు. తిరిగి వాటి నిర్వహణకు టెండర్లు పి లిచే పనిలో ఉన్నాం. పార్కులను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అర్బన పార్క్‌ ప్రారంభం అనేది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటాం.

- సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - Apr 17 , 2025 | 12:16 AM