ఇలాగే ప్రజల మన్ననలు అందుకోవాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:14 AM
‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఇలాగే ప్రజల మన్నలు అందుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీవాణి అన్నారు.
గ్రూప్-1కు ‘ఆంధ్రజ్యోతి’ ఉపయోగపడింది : డీటీసీ శ్రీవాణి
యూనిట్ కార్యాలయంలో ఆంధ్రజ్యోతి కార్, బైక్ రేస్ విజేతలకు బహుమతుల ప్రదానం
నల్లగొండ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఇలాగే ప్రజల మన్నలు అందుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీవాణి అన్నారు. బుధవారం నల్లగొండలోని ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయంలో 23వ వార్షికోత్సవ పురస్కారాలకు సంబంధించిన బహుమతులను ప్రదానం చేశారు. గత నెల 24వ తేదీన రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయంలో బహుమతులకు సంబంఽధించిన డ్రా తీసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో డీటీసీ శ్రీవాణి, డీటీవో, ఎంవీఐ ఐ. లావణ్య విజేతలకు ప్రథమ(బైక్), ద్వితీయ(ఫ్రిజ్), తృతీయ(టీవీ) బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీటీసీ శ్రీవాణి మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక తనకు ఎంతో ఉపయోగపడిందన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎంతో నాణ్యతతో మంచి వార్తలను ప్రచురిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటుందన్నారు. సర్క్యూలేషన్ కూడా అధికంగా ఉందని, మరింత సర్క్యూలేషన్ పెరగాలని ఆక్షాంక్షించారు. బహుమతులను అందజేస్తూ పాఠకులను ప్రోత్సహి ంచడం సంతోషంగా ఉందన్నారు. డీటీవో, ఎంవీఐ ఐ. లావణ్య మాట్లాడుతూ తాము విద్యార్థి దశలో ఎడ్యుకేషన్ పేజీని బాగా చదివేవారమని అన్నారు. తాను చదివిన పాఠశాల, కళాశాలల్లో ప్రత్యేకంగా దినపత్రికలు, పుస్తకాలు చదువుకోవడానికి ప్రత్యేకంగా తరగతి ఉండేదన్నారు. తాము చదివిన విషయాలను ఇతర విద్యార్థులకు వివరించేవారమని పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే విషయాలు ఉంటాయన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నదన్నారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచ్ మేనేజర్ దాసరి చంద్రశేఖర్‌రావు, బ్యూరో ఇన్‌చార్జి చల్లా సాంబశివారెడ్డి, ఏసీఎం ఉన్నం భాస్కర్, పీసీ ఇన్‌చార్జి పులిమామిడి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషంగా ఉంది
ఆంధ్రజ్యోతి పాఠకుడిగా డ్రాలో విజేతగా నిలవ డంతో పాటు మొదటి బహుమతి అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి పాఠకుడిగా ఉన్నాను. బహుమతి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఆంధ్రజ్యోతి దినపత్రికకు అభి మానిని. ప్రతిరోజూ తప్పనిసరిగా ఆంధ్రజ్యోతి పత్రిక చదువుతా. వార్తల వల్ల తనకు ఎంతో ఉపయోగప డుతుంది. ప్రతిఒక్కరూ ఆంధ్రజ్యోతి దినపత్రికను ఆదరించాలి.
వెలుగూరి కార్తీక్, (పథమ బహుమతి విజేత), రాయినిగూడెం, సూర్యాపేట జిల్లా
పత్రికకు వీరాభిమానిని
ఆంధ్రజ్యోతి పత్రికకు వీరాభిమానిని. తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నేను ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలను స్ఫూర్తిగా తీసుకుంటాను. పాత ఆంధ్రజ్యోతి ఉన్నప్పటి నుంచి ఆంధ్రజ్యోతి పత్రిక చదివేవాడిని. 23 సంవత్సరాలుగా నిరంతరం పత్రిక చదువుతున్నాను. ఆంధ్రజ్యోతి సాహోసోపేతమైన పత్రిక. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా వార్తలను ప్రచురించడం సంతోషకరం.
సిలివేరు వెంకటేశ్వర్లు (ద్వితీయ బహుమతి విజేత), చిలుకూరు మండలం, సూర్యాపేట జిల్లా
నిర్భయంగా వార్తలు ప్రచురించేది ఆంధ్రజ్యోతినే
ఆంధ్రజ్యోతి దినపత్రిక తటస్థంగా ఉంటుంది. నిర్భయంగా వార్తలు రాయడం ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రత్యేకత. అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందుతోంది. ప్రతి వార్తను ప్రచురిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రజ్యోతి ప్రతి ఏటా డ్రాను ఏర్పాటు చేసి బహుమతులను ప్రధానం చేయడం సంతోషకరం. పాఠకుల ఆదరాభిమానాలను ఆంధ్రజ్యోతి మరింతగా చూరగొననుంది.
పొనుగోటి శంకర్‌రావు (తృతీయ బహుమతి విజేత), నల్లగొండ.