Retired IAS Officer: విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రసాదరావు కన్నుమూత
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:56 AM
ఐఏఎస్ మాజీ అధికారి ఎం.ప్రసాదరావు (84) బుధవారం హైదరాబాద్‌లో మృతిచెందారు. పురపాలక అభివృద్ధిలో విశేష సేవలందించిన ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎం.ప్రసాదరావు (84) బుధవారం హైదరాబాద్ మెహదీపట్నంలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి పలువురు మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారులతో పాటు మాజీ సీఎస్ రాజీవ్‌శర్మ నివాళులర్పించారు. ప్రసాదరావుతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1964లో ఆయన మునిసిపల్‌శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు. 1984లో ఐఏఎ్‌సగా పదోన్నతి లభించింది. పట్టణ ప్రణాళిక, అభివృద్ధి విషయంలో ప్రసాదరావు మంచి నిపుణులని పేరుండేంది. 2001లో ఆయన పదవీ విరమణ చేసేనాటికి పురపాలకశాఖ డైరెక్టర్‌గా ఉన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా మునిసిపల్‌శాఖ, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ, జేఎన్‌యూఆర్‌ఎమ్‌లకు సేవలందించారు. ఆయన కుటుంబసభ్యులంతా కూడా విద్యాఽధికులే. యశోదా ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ మల్లెల వెంకటేశ్వరరావు (ఎంవీరావు) ప్రసాదర్‌రావుకు అల్లుడు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ప్రసాదరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...