Share News

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:12 PM

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చి దిద్దడంలో పంచాయతీ కార్యదర్శులది క్రియశీలకమైన పాత్ర ఉంటుందని జి ల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. సోమవారం కాసిపేట మండలంలోని చిన్నధర్మారం, కోనూరు,

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
కోనూరులో నర్సరీని పరిశీలిస్తున్న డిపీవో వెంకటేశ్వర్‌రావు

డీపీవో వెంకటేశ్వర్‌రావు

కాసిపేట, ఏప్రిల్‌21 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చి దిద్దడంలో పంచాయతీ కార్యదర్శులది క్రియశీలకమైన పాత్ర ఉంటుందని జి ల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. సోమవారం కాసిపేట మండలంలోని చిన్నధర్మారం, కోనూరు, మద్దిమాడ గ్రామ పంచాయతీల్లో ఆ కస్మికంగా పర్యటించి పనులను పర్యవేక్షించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్య క్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి మంగళవారం, శనివారం చెత్త సేకరించి తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి సెగ్రి గేషన్‌ షెడ్లకు చేర్చాలని సూచించారు. దీని నుంచి వర్మికంపోస్టు తయారు చేసి రైతులకు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి పోయి గ్రామాల్లో తాగునీ టికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి స్థానికంగా ఉండే కార్యదర్శులు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ తాగు నీటి స మస్య లేకుండా చూడాలన్నారు. అన ంతరం నర్సరీలను పరిశీలించి వచ్చే జూన్‌ నాటికి నర్సరీలోని మొక్కలు హరితహారానికి అందుబాటులోకి తేవాల న్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరంగా కఠిన చర్యలు ఉంటా యని హెచ్చరించారు. అనంతరం పంచాయతీలోని రికార్డులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సప్తర్‌ అలీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:12 PM